SAKSHITHA NEWS

Rapid City Development with Master Plan Roads: MLA Bhumana

మాస్టర్ ప్లాన్ రోడ్లతో శరవేగంగా నగరాభివృద్ది: ఎమ్మెల్యే భూమన
మెరుగైన రోడ్లతో అభివృద్ది పెంపు: మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ*
ప్రజల భాగస్వామ్యంతో రహదారుల అభివృద్ది : డిప్యూటీ మేయర్ భూమన అభినయ్


సాక్షిత : తిరుపతి నగరంలో చేపట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్లతో నగరాభివృద్ధి శరవేగంగా జరుగుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్లను శ‌నివారం ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డిలు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ తిరుపతి నగరం ఓకే చోట కేంధ్రీకృతం అవుతుండడం వలన నగర ప్రజలు, యాత్రీకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొవడం జరుగుతున్నదనే విషయాన్ని క్షున్నంగా పరిశీలించి నగరాభివృద్దికి తిరుపతి నగరానికి తూర్పు వైపున ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావలనే లక్ష్యంతో నగరపాలక సంస్థ సంకల్పంతో నూతన రహదారును నిర్మిస్తున్నట్లు తెలిపారు. నగరాభివృద్దికి మూలమైన 14 మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేసేందుకు అందరం ప్రజల భాగస్వామ్యంతో పని చేద్దామన్నారు.

దశాబ్దాలుగా అభివృద్దికి దూరంగ వున్న కోర్లగుంట ప్రధాన రోడ్డు నేడు విస్తరణతో ఆ ప్రాంతం రాకపోకలకు చాలా సౌకర్యవంతంగ అందుబాటులోకి రానున్నదన్నారు. మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ 35 కోట్లతో ఎనిమిదిన్నార కిలో మీటర్లతో కౌన్సిల్ అనుమతితో చేపట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్లు అన్ని పూర్తి అయితే ప్రజలు ఆర్ధికంగ లాభపడడంతోబాటు ఎన్నో విదాలుగా ప్రయోజనాలు పొందుతారన్నారు.

మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తిచేసేందుకు ఇంజనీరింగ్, ప్లానింగ్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నట్లు వివరించారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే వై.ఎస్.ఆర్ మార్గ్, అన్నమయ్య మార్గ్ పూర్తితో ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉపయోగ పడుతున్నాయని, మిగిలిన కొర్లగుంట, అంకురా హాస్పిటల్, హిరోహోండా షోరూమ్, గొల్లవానిగుంట, కొంకాచెన్నయ్యగుంట, అక్కారంపల్లె, చింతలచేను మాస్టర్ ప్లాన్ రోడ్లను ప్రజల భాగస్వామ్యంతో త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, నరసింహాచారి, ఆధం రాధాకృష్ణా రెడ్డి, పుల్లూరు అమర్నాధ్ రెడ్డి, ఉమాఅజయ్, శేఖర్ రెడ్డి, అనీల్, తిరుపతి మునిరామిరెడ్డి, గణేష్, దూదికుమారి, కో ఆప్షన్ సభ్యులు వెంకట్ రెడ్డి, అదనపు కమిషనర్ సునీత, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకటరామి రెడ్డి, డిఈలు విజయకుమార్ రెడ్డి, మహేష్, సంజీవ్ కుమార్, డిప్యూటీ సిటీ ప్లానర్ దేవి కుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు బాలసుబ్రమణ్యం, షణ్ముగం పాల్గొన్నారు.


SAKSHITHA NEWS