అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా మైక్రో అబ్జర్వర్స్ ర్యాండమైజేషన
-సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టే
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
లోకసభ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా మైక్రో అబ్జర్వర్స్ ర్యాండమైజేషన్ ను సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టే, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ లు సోమవారం చేపట్టారు. నూతన కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మైక్రో అబ్జర్వర్స్ ర్యాండమైజేషన్ చేపట్టి, 207 మంది మైక్రో అబ్జర్వర్స్ లను అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్డిఎం శ్రీనివాస రెడ్డి, కలెక్టరేట్ ఏవో అరుణ, ఎన్ఐసి కోఆర్డినేటర్ రాంప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.