జర్నలిస్ట్ కుటుంబాల ఆరోగ్య రక్షణకు అండగా రాందేవ్ రావ్ ఆస్పత్రి

Spread the love

కూకట్ పల్లి రాందేవ్ రావ్ ఆస్పత్రిలో జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు 50% రాయితీతో కూడిన వైద్య సదుపాయాలు అందించేందుకుగాను ఆస్పత్రి నిర్వాహకులు సానుకూలంగా స్పందించింది. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం ఆస్పత్రి హెల్త్ డైరెక్టర్ డాక్టర్ కల్నాల్ కమలాకర్ ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు మాట్లాడుతూ కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఆరోగ్యపరమైన రక్షణ కల్పించాలని రాందేవ్ ఆస్పత్రి హెల్త్ డైరెక్టర్ డాక్టర్ కల్నాల్ కమలాకర్, అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ యోబులను కోరారు. సమాజానికి సేవ చేయడంలో జర్నలిస్టులు తమ ఆరోగ్యాలను సైతం పన్నంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. సేవ చేస్తున్న జర్నలిస్టుల కుటుంబాలకు మెరుగైన వైద్య సదుపాయాలను కలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రిలో ఓపి విభాగంతో పాటు, ల్యాబ్, ఇన్ పేషంట్, శస్త్ర చికిత్సలకు 50 శాతం రాయితీ కల్పించాలని కోరారు.

ఇందుకు స్పందించిన హెల్త్ డైరక్టర్ డాక్టర్ కల్నాల్ కమలాకర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు తప్పకుండా రాయితీతో కూడిన వైద్య సదుపాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అన్ని రకాల సదుపాయాలను ఆస్పత్రిలో రాయితీతో కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాందేవ్ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచామని తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని పేర్కొన్నారు. కూకట్పల్లి కెపిహెచ్బి, బాలానగర్, ఎల్లమ్మబండ, జగద్గిరిగుట్ట, గాజులరామారం ప్రాంతాలకు చెందిన సామాన్యులకు ఆస్పత్రిలో మెరుగైన చికిత్సలను అందిస్తున్నామని తెలిపారు.

ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ యోబు మాట్లాడుతూ ఓపితోపాటు, ల్యాబ్, ఇన్ పేషంట్, శస్త్ర చికిత్సలకు రాయితీలు వర్తించేలా తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కుటుంబ సభ్యులకు సంబంధించిన అందరి వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డులు, దరఖాస్తులు అందించాలని సూచించారు. వీటిని పరిశీలించి జర్నలిస్టు కుటుంబ సభ్యులకు రాయితీ కార్డులను అందజేస్తామని తెలిపారు. 400 మంది విలేకరుల వరకు రాయితీ కార్డులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూకట్పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కరీం, వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజు, కుతుబులాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్, కోశాధికారి శేషారెడ్డి, సీనియర్ జర్నలిస్టులు శ్రీధర్, నాగరాజు,రామారావు, నవీన్, చంద్ర, రాము, రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page