Ramagundam Police conducted a spontaneous community contact programme
ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించిన రామగుండం పోలీసులు
సాక్షిత : పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్, పెద్దపల్లి జోన్ కమాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంచికల్ పేట్ లో సీపీ ఆదేశాల మేరకు పెద్దపెల్లి డిసిపి రూపేష్ ఐపిఎస్.ఉత్తర్వుల ప్రకారం గోదావరిఖని ఏసిపి గిరిప్రసాద్ ఆధ్వర్యంలో గోదావరిఖని టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ కమాన్పూర్ ఎస్సై షేక్ మస్తాన్, ఎస్ఐ లు పోలీస్ సిబ్బంది మొత్తం 65 మందితో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
సరైన పత్రాలు లేనటువంటి 2 వీలర్స్- 58, 3 వీలర్స్- 4, 4 వీలర్స్- 1 వాహనాలను సీట్ చేయడం జరిగింది.ఏసీపీ గామాట్లాడుతూ పోలీసులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఎలాంటి సమస్య ఉన్న చట్టపరిధిలో పరిష్కరించడం జరుగుతుందని అదేవిధంగా ఇతర సమస్యలేమైనా ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే పోలీసులు ధ్యేయమన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. ప్రజలు అసాంఘిక శక్తులకు సహకరించవద్దన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండా లని, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం, ఓటీపీ వివరా లను చెప్పవద్దన్నారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
మి ప్రాంతం లోకి ఎవరైనా కొత్త వారు వస్తే ఆశ్రయం ఇవ్వద్దన్నారు. మీ ప్రాంతంలో ఎవరైనా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడినట్లయితే డైలీ 100 కానీ లేదా స్థానిక పోలీసుల కు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, ధృవీకరణ పత్రాలను కలిగి ఉండాలన్నారు.స్క్రాప్ దుకాణం వాళ్ళు ఎవరైనా కొత్త వ్యక్తులు సింగరేణి, రైల్వే, కరెంట్ ట్రాన్స్ఫర్ కాఫర్( రాగి ) కి సంబంధించిన ఇనుమును తీసుకొచ్చి అమ్మడానికి మీ దగ్గరకు వస్తే వారి ఆధార్ కార్డ్స్ తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలి లేదంటే స్క్రాప్ యజమానులుపై చట్టరీత్య చర్యలు తీసుకోబడుతాయి.
ఈ మధ్య కాలం లో ఓ వ్యక్తి అక్రమంగా ట్రాన్స్ఫర్మార్ లోని కాపర్ దొంగిలిస్తున్న సమయం లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో ఏసీపీ గోదావరిఖని ఏ సి పి గిరి ప్రసాద్, గోదావరిఖని టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లు వేణుగోపాల్,హౌసలుద్దీన్అబ్జాలోద్దీన్, గోదావరిఖని వన్ టౌన్ టు ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, కమాన్పూర్ ఎస్సై షేక్ మస్తాన్, టూ టౌన్ ఎస్ఐ శ్యామ్ పటేల్, రామగిరి ఎస్ఐ రవి ప్రసాద్, ఇతర ఎస్ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు