ఈరోజు నుంచి వర్షాలు పెరిగే అవకాశం.
బంగాళాకాతం లో అల్పపీడనం ఏర్పడి వుంది. ఈ అల్పపీడన ప్రభావం వలన ఈరోజు నుంచి వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యగమనిక :సెప్టెంబర్ 18 వినాయక చవితి పండుగ సందర్బంగా అల్పపీడనం దృష్య మండపాలు కట్టేడప్పుడు తగిన జాగ్రత్త లు పాటించండి.
ఈరోజు కాస్త ఏండా తీవ్రత 31 డిగ్రీలు నమోదవుతుంది. ఈరోజు కృష్ణా, గుంటూరు, విజయవాడ, ఏలూరు, గుడివాడ, మచిలీపట్నం, రేపల్లె, దివిసీమ భాగాల్లో మనం వర్షాలను చూస్తాం.
అల్పపీడనం ప్రభావం వలన 16,17,18,19,20 వరకు కృష్ణా, గుంటూరు, విజయవాడ ఏలూరు, బీమవరం, మచిలీపట్నం, దివిసీమ బాగాళ్ళు, రాజమహేంద్రవరం, తుని కాకినాడ, అమలాపురం, యానాం విశాఖపట్నం, విజయనగరం వివిధ భాగాల్లో కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు గాను మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయి.