చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
చిట్యాల పట్టణంలోని ఉరుమడ్ల రోడ్డులోని రైల్వే ట్రాక్ వద్ద ప్రజలకు రైలు పట్టాలు దాటుట గురించి రైల్వే ఏఎస్ఐ వెంకన్న అవగాహన కల్పించారు. రైలు స్పీడుని అంచనా వేయడం కష్టమవుతుందని రైల్వే ట్రాక్ దాటే సమయంలో అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటిస్తూ దాటాలని తెలిపారు. సికింద్రాబాద్ నుండి నల్లగొండ మీదుగా తిరుపతి వెళ్ళు వందే భారత్ రైలు చిట్యాల రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1గం. ని ల మధ్యలో ఆగుతుందని ప్రజలందరూ రైల్వే స్టేషన్ కి వచ్చి స్వాగతం పలికాలను కోరారు.