9 ఏళ్లయిన డబల్ బెడ్రూమ్లు ఒక్కరికైనా ఇచ్చారా!?
గద్వాల పట్టణంలోని డికె. బంగ్లాలో మల్దకల్ మండలం సద్దలోని పల్లి గ్రామానికి చెందిన 30మంది BRS పార్టీకి చెందిన యువకులు భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి బిజెపి పార్టీలోకి ఆహ్వానించిన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె . అరుణమ్మ.ఈ సందర్భంగా డికె. అరుణమ్మ మాట్లాడుతూ..దేశం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ కి ఓటు వేయాలని ,దేశంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అన్నారు.9 ఏళ్ల అయినా ఒక్కరికైనా డబల్ బెడ్ రూమ్లు ఇవ్వలేదని ,ఈసారి ఓట్ల కోసం ఇండ్ల ముందరికి వస్తే నిలదీయాలని అన్నారు.నా హయాంలోనే గద్వాల అభివృద్ధి చెందిందని బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లయిన చిన్న గుంతకు ఒక గంప మట్టి వేయలేదని ,రోడ్లు, వేయలేదని అన్నారు.గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరిగిందని వైకుంఠధామాలు, రైతు వేదికలు, హరితహారం,సిసి రోడ్లు ఇలా మొదలైనవి.మీకు అండగా నేనున్నానని , భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని , మీకు ఏ కష్టం వచ్చినా మీకు అండగా ఉంటానని భరోసా కల్పించడం జరిగింది..
పార్టీలో చేరిన వారు
సత్యనారాయణ, కె.ప్రకాష్,క్రిష్ణ, వెంకటేష్, రవి, జయన్న, శ్రీకృష్ణ, పోతుల రవి, కృష్ణం రాజు, సత్య, జి. రామకృష్ణ, హరి క్రిష్ణ
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు ,బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు నెమలి కంటి అంజి, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడు ఈశ్వర్ తదితరులు ఉన్నారు..