SAKSHITHA NEWS

పైసలు కొట్టు ఎన్ ఎస్ పి కాలనిలో క్వార్టర్ పట్టు–క్రింది స్థాయి అధికారులు ఇష్ట రాజ్యం


సాక్షిత ప్రకాశం జిల్లా త్రిపురాంతకం:
లక్షల్లో అప్పులు ఎగవేసిన క్వార్టర్లనే మరొకరికి అధిక అద్దెలకు ఎన్ ఎస్ పి క్వార్టర్లు ధారాదత్తం చేస్తున్న అలాట్మెంట్ దారులు
ఉన్నతాధికారులు సిఫారసులు లేకుండానే ఇష్టారాజ్యముగా క్రింది స్థాయి అధికారుల కేటాయింపులు
రాజకీయ నాయకుల పేర్లతో కేటాయించిన క్వాటర్స్ కు లక్షల్లో అద్దె బకాయిలు ఉన్న అద్దె వసుళ్ళ నుండి మినహాయింపు
రెగ్యులర్ గా అద్దెలు చెల్లించే వారినే ముక్కు పిండి మరి వసూలు చేస్తున్న అధికారులు
రాజకీయ నాయకుల సిఫారసులతో క్వార్టర్ల కేటాయింపు
అలాట్మెంట్ దారులు ఇష్టారాజ్యంగా అధిక అద్దెలకు బదలాయింపు
క్వార్టర్స్ లో నిజంగా ఉంటున్న కుటుంబాలకు అనధికార నివాసాల వారితో ఇక్కట్లు
ఎనేస్పీ ఉద్యోగులు ఉండాల్సిన క్వార్టర్స్ లో ప్రవేటు వ్యక్తుల ప్రవేశం

త్రిపురాంతకం మండల కేంద్రంలో 1974 లో నాగార్జున సాగర్ కెనాల్ నిర్మాణ సమయంలో ఎన్ ఎస్ పి డిపార్ట్మెంట్లో పని చేయుచున్న అధికారులు సిబ్బంది నివసించడానికి మూడు డివిజన్లకు కలిపి దాదాపుగా 200 క్వార్టర్స్ ను నాగార్జున సాగర్ ప్రాజెక్టు వారు నిర్మించటం జరిగింది.అప్పటి నుండి ఎనేస్పీ ఉద్యోగులు ప్రభుత్వం కేటాయించిన అద్దెలు చెల్లిస్తూ నివసించే వారు.200 క్వార్టర్స్ లో రానురాను దాదాపుగా 100 క్వార్టర్స్ శిధిలం అయ్యాయి. మిగిలిన క్వార్టర్లలో ఎనేస్పీ కి సంభందించిన ఉద్యోగులు ఉండాల్సిన క్వార్టర్స్ లో ప్రవేటు వ్యక్తులు పరకాయ ప్రవేశం చేశారు.చోటా నాయకులు దగ్గర మొదలుకొని బడా నాయకుల వరకు తమ రాజకీయ పలుకుబడులు ఉపయోగించి ఎనేస్పీ క్వార్టర్స్ లో గదులను అలాట్మెంట్ చేసుకున్నారు.

అలాట్మెంట్ చేయించుకున్న వ్యక్తులు కూలీ నాలి చేసుకొని బ్రతికే వారైతే పర్వాలేదు. పై అధికారుల సిఫారసులు లేకున్నా బడా నాయకులకు మాత్రమె అలాట్మెంట్ ఇచ్చి వారి నుండి అధిక మొత్తంలో అద్దెలను వసూలు చేసుకొని క్రింది స్థాయి అధికారులు తమ జేబులను నింపుకోవడం గమార్హం. ప్రభుత్వానికి నెలకు 300 నుండి 500 చెల్లించే రూములను అనర్హులకు వేలల్లో అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు.అలా అయిన పర్వాలేదు అనుకుంటే వారు అద్దెకు ఇచ్చిన వారి దగ్గర సొమ్ము నెల నెలా వసూల్ చేసుకున్తున్నారే తప్ప ప్రభుత్వానికి చెల్లించాల్సిన అద్దె రుసుము ఏళ్ళ తరబడి కట్టకుండా ఎగనామం పెడుతున్నారు. ఉద్యోగులు ఉండాల్సిన క్వార్టర్లలో ఉద్యోగ కుటుంబాలు నామ మాత్రంగా ఉన్నప్పటికీ అలాట్మెంట్ వున్న వారి దగ్గర అద్దె లకు యువత మరియు సింగిల్ డిజిట్స్ పరసన్స్ అద్దెకు తీసుకొని ఎనేస్పీ లో త్రిష్ట వేసి మద్యం త్రాగటం మరెన్నో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించటంతో నిజమైన హక్కు దారులు ఎనేస్పీ ఉద్యోగుల కుటుంబాలు ఆ ఆగడాలతో క్వార్టర్స్ లో యువత చక్కెర్లు కొడుతుంటే జీవనం ఇబ్బందిగా మారింది అంటున్నారు కొందరు.

ఇది ఇలా ఉంటె ఎనేస్పీ ఉద్యోగులకు మాత్రమె చెందాల్సిన సదరు కాలనీ క్వార్టర్స్ బయట వ్యక్తుల చేతుల్లోకి ఎలా పోయాయి అనేది ప్రశ్నార్ధకంగా మారింది.ఇంత జరుగుతున్నా ఎనేస్పీ అధికారులు ఆక్రమణదారులు అనధికారికంగా నివాసం ఉంటున్న వారిపై అలాగే లక్షలకు లక్షలు ప్రభుత్వానికి అద్దె చెల్లించకుండా ఎగనామం పెట్టి పెత్తనం చలాయిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు అధికారులు మౌనంగా ఉంటున్నారనే మండల ప్రజానీకానికి అర్ధం కాని పరిస్థితి. ప్రభుత్వానికి అద్దె చెల్లించకుండా పై అధికారుల ప్రమేయం లేకుండా బయట వారికి ఆద్దేలకు ఇస్తూ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండటంపై అధికారుల పై ప్రజలకు అపనమ్మకం ఏర్పడింది.

ఇవే కాకా అనధికారికంగా కొందరిని అడ్డం పెట్టుకొని అక్కడ త్రిష్ట వేసిన కొందరు వారి మాట సాగాలని వారి మాట వినక పొతే క్షుద్ర పూజలు చేసి చూపిస్తాం అని అన్నట్లుగా రాత్రి వేళ్ళల్లో జన సంచారం లేని సమయంలో మాటు వేసి కొన్ని క్వార్టర్ల దగ్గర ముగ్గు వేయటం పసుపు కుంకుమ చల్లి భయబ్రాంతులకు గురి చేసి కొందరిని ప్రలోభ పెట్టాలనే ప్రయత్నాలు జరిగాయి.ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ క్వార్టర్స్ లో ప్రవేటు వ్యక్తులకు అలాట్మెంట్ ఇవ్వటం .రూమ్ అలాట్మెంట్ పొందిన వ్యక్తులు అధిక అద్దెలకు ఆశ పడి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అద్దె బకాయిలు లక్షల్లో ఎగనామం పెట్టి ప్రవేటు వ్యక్తులకు యువతకు అధిక అద్దెలకు రూమ్స్ ఇచ్చి కాలనీ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా అసాంఘిక కార్యకలాపాల నిలయంగా ఎందుకు మారిందో ,అద్దెలు లక్షల రూపాయలు ఎగ్గొట్టి బయట వారికి అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్న వారిపై సంభందిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి


SAKSHITHA NEWS