ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…
రూ.1,01,17,500/- విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 142 మంది సీఎంఆర్ఎఫ్ పథకం లబ్ధిదారులకు రూ.1,01,17,500/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి చింతల్ లోని తన కార్యాలయం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించటం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తున్నదన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలంటే కేవలం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దళారులు, మోసగాళ్ళకు తావులేకుండా నేరుగా లబ్ధిదారులకు అందేలా చేశారని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కే.ఎం.గౌరీష్, నిజాంపేట్ కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు సంజు యాదవ్, సాయి యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు జయరాం, లక్ష్మారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు కిషన్ రావు, సూర్యప్రభ, దుండిగల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, కొంపల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, దేవరకొండ శ్రీనివాస్, పోలె శ్రీకాంత్ మరియు సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.