ఘనంగా వరల్డ్ ఫోటోగ్రఫీ డే – తిరుపతి ప్రెస్ క్లబ్ లో వేడుకలు

Spread the love

ఘనంగా వరల్డ్ ఫోటోగ్రఫీ డే – తిరుపతి ప్రెస్ క్లబ్ లో వేడుకలు
సాక్షిత, తిరుపతి బ్యూరో: తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం 184వ వరల్డ్ ఫోటోగ్రఫీ వేడుకలు ఆంద్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఫోటో, వీడియో జర్నలిస్టులు కలసి కేకే కట్ చేసారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె. గిరిబాబు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను..అక్రమాలను, సమస్యలను అనునిత్యం గుర్తించి వాటిని తమ చిత్రాల ద్వారా ప్రభుత్వాన్ని కదిలించే శక్తి ఫోటో జర్నలిస్టులకు మాత్రమే ఉందన్నారు. ఒక సంఘటనకు ఆధారం చిత్రం, చరిత్రకు సజీవ సాక్ష్యం చిత్రమని అన్నారు. రోజు రోజుకి టెక్నాలజీ లో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని మరింత నాణ్యమైన, విలువైన చిత్రాలు తీసేవిధంగా ఫోటో జర్నలిస్టులు కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. అనంతరం సీనియర్ ఫోటో జర్నలిస్ట్ ఈ.గోపాలకృష్ణ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి బాలచంద్రా, ఫోటో జర్నలిస్టులు రామకృష్ణ రెడ్డి, పీటర్, శ్రీను రాయల్, ఏబీఎన్ శివుడు, జయకుమార్, ప్రవీణ్, మోహన్ రాజ్, కేతారి మోహన కృష్ణ రాయల్, బిజెపి రాష్ట్ర నాయకుడు గుండాల గోపినాద్ రెడ్డి, వీడియో జర్నలిస్టులు గిరి, టీవీ5 శేఖర్, రాజు, వాసు, చరణ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page