సాక్షిత : జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పైసా ఖర్చు లేకుండా పేదలకు మెరుగైన వైద్య సేవలు- నగర మేయర్ డాక్టర్ శిరీష
ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి జగనన్న. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు.
నగర పరిధిలోని జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ జీవకోన గురు కృప స్కూల్, ఖాదీ కాలనీ మున్సిపల్ పార్క్ సమీపంలో పాల్గొని ప్రజలకి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రజలందరి ఆరోగ్యానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద పేట వేసారని పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జగనన్న ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నదే జగనన్న ఆశయమని తెలిపారు. పైసా ఖర్చు లేకుండా ఇంటి వద్దకే మెరుగైన వైద్య సేవలు అందించడం జగనన్న ప్రభుత్వానికి సాధ్యమని తెలిపారు. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని తెలిపారు. అనంతరం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు ప్రజలకు ఆరోగ్య సురక్ష కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాధా మురళి, ఆరోగ్య అధికారి డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవిన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, సూపరింటెండెంట్ రవి, జూనియర్ అసిస్టెంట్ రాధాకృష్ణ, డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.