SAKSHITHA NEWS

Problems of scheme workers should be solved – AITUC district secretary Kodandaiah, called

స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి -ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోదండయ్యా, పిలుపు
ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగరి ఆర్డిఓ కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్కీం కార్మికులు ధర్నా నిర్వహించడం జరిగింది , రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు పని చేసినటువంటి ఆశ అంగన్వాడి మధ్యాహ్నం భోజనం ఆరోగ్యమిత్ర మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో , కనీస వేతనం అమలు పరచి ,

ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా , మహిళా కార్మికుల శ్రేయస్సు దేయ్యంగా ఏ ఐ టి యు సి పని చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ య్య పిలుపునిచ్చారు.

ఈరోజు ఏ ఐ టి యు సిఆధ్వర్యంలో ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా కార్మికులకు వేతనాలు పెంచుతామని కార్మికుల ఆదుకుంటామని చెప్పి ఈరోజు పట్టించుకోకపోవడం బాధాకరం, మహిళా కార్మికుల కష్టార్జితంతో ప్రభుత్వ పథకాల వలన ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నది,

కానీ మహిళా కార్మికుల తలరాత మాత్రం మారలేదు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసుతోష్ మిశ్రా రిపోర్టు ప్రకారం కార్మికులకు 26 వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేసారు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు,ఇప్పుడు జరిగే శాసనసభ సమావేశాల్లో మహిళా కార్మికుల సమస్యలపై చర్చించి జీతాలు పెంచాలని, ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్చార్జీలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్ కింద పది లక్షల రూపాయలు డబ్బులు చెల్లించి ప్రతినెలా ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అనంతరం నగరి ఆర్ డి ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చందా మరి, ఏఐటీయూసీ నాయకులు వేలను భాష, ఆశా వర్కర్స్ యూనియన్ ఏరియా కార్యదర్శులు రూప ఉషారాణి ప్రియ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు వేణి మండల కార్యదర్శి జమున, kalaivani వనిత పుష్పా మహిళా కార్మిక నాయకులు మాణిక్యమ్మ వెంకటమ్మ పవిత్ర మంగమ్మ గీత రాజి చంద్రకళ మహిళా కార్మికులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS