శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న మెదక్ జిల్లా తూప్రాన్‌కు రానున్నట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, పార్లమెంట్ కన్వీనర్ రామ్మోహన్గౌడ్లు తెలిపారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 శాసనసభ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. సభా స్థలం కోసం సోమవారం తూప్రాన్ శివారులోని పలు ప్రాంతాలను పరిశీలించారు. పురపాలిక పరిధి టాటా కాఫీ పరిశ్రమ వెనుక ఉన్న 80 ఎకరాల్లో సభను నిర్వహించేందుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంగళ, బుధవారాల్లో పూర్తి షెడ్యూల్ వస్తుందన్నారు. అప్పటిలోగా స్థలాన్ని ఎంపిక చేసి అధిష్ఠానానికి పంపిస్తామన్నారు. కార్యక్రమంలో భాజపా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, నాయకులు సాయిబాబాగౌడ్, నందన్‌గౌడ్, బాలపోచయ్య, సర్పంచులు నత్తి మల్లేశ్, పిట్ల పోచయ్య పాల్గొన్నారు.
శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న మెదక్ జిల్లా తూప్రాన్
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…