SAKSHITHA NEWS





Prime Healthcare Foundation Chairman Dr. Premsagar Reddy met Jagan

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన ప్రైమ్‌ హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డి

ప్రైమ్‌ హెల్త్‌ కేర్‌ ఆధ్వర్యంలో అమెరికాలోని 14 రాష్ట్రాలలో 46 ఆసుపత్రులు నిర్వహిస్తూ, యూఎస్‌లోని టాప్‌ టెన్‌ వైద్య వ్యవస్ధల్లో ఒకటిగా ప్రైమ్‌ కేర్‌కు ప్రత్యేక గుర్తింపు

సీఎంతో సమావేశం అనంతరం డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డి ఏమన్నారంటే…

దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నాకు మంచి స్నేహితుడు అలాగే నా సహాధ్యాయి. మేం వివిధ అంశాలపై చర్చించాం, అందులో ప్రధానంగా ఏపీలో ఆరోగ్యరంగంపై చర్చ జరిగింది, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ చాలా బావుంది, ఏపీలో 98 శాతం డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకం జరగడం గొప్ప విషయం. ఏపీకి డిజిటల్‌ ఎక్స్‌రే మిషన్లు, అత్యాధునిక మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ను ఇవ్వడానికి నేను సిద్దంగా ఉన్నాను.

కోవిడ్‌ సమయంలో కూడా అతి తక్కువ వ్యవధిలో 1500 ఆక్సీజన్‌ కాన్సన్‌ట్రేటర్‌లు ఇచ్చాను. పేదలకు ఇళ్ళు, ఆరోగ్యశ్రీ, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో చాలా చక్కగా సీఎం అభివృద్ది చేస్తున్నారు. ఈ రాష్ట్రం కోసం అనేక గొప్ప పనులు చేస్తున్నారు. తన తండ్రిలా చక్కటి పాలన అందిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటున్నారు, ఈ కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వంలో నేను భాగస్వామ్యం కావడం చాలా గర్వంగా, సంతోషంగా ఉంది, అన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న డాక్టర్‌ ప్రసాద్‌ జి.రెడ్డి, డాక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, డాక్టర్‌ రాఘవరెడ్డి, మెడికల్‌ అడ్వైజర్‌ ఎన్నారై ఎఫైర్స్‌ వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి, ఏపీఎన్‌ఆర్‌టీ ప్రెసిడెంట్‌ మేడపాటి వెంకట్, సీఎంవో అధికారులు.


SAKSHITHA NEWS