Press system should change with time
పత్రికా వ్యవస్థ కాలానుగుణంగా మార్పు చెందాలి
— టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ
— ‘ప్రజాక్రాంతి’ క్యాలెండర్ ను ఆవిష్కరించిన టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి రోజుల్లో పత్రికా వ్యవస్థ కాలానుగుణంగా మార్పులు చెందాల్సిన ఆవశ్యకత ఉందని టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ అన్నారు.
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం ఆయన ‘ప్రజాక్రాంతి’ దినపత్రికకు చెందిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ… గతంలో పత్రికా వ్యవస్థకు నేటి వార్త ప్రపంచానికి గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. నాడు ఇంటికి వచ్చే పత్రిక ద్వారానే దైనందని సమాచారాన్ని తెలుసుకునే వారమని, నేడు అలాంటి పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు.
యావత్ ప్రపంచం గ్రామంగా మారిపోయిన ఈ రోజుల్లో.. చేతిలో ఇమిడి ఉన్న సెల్ ఫోన్ ద్వారా అనేక కబుర్లను నిమిషాల వ్యాధిలోని తెలుసుకోగలుగుతున్నామని గుర్తు చేశారు. ఈ క్రమంలో పత్రికా వ్యవస్థలోను సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. పత్రికలు తెరచి చూసే సమయం లేని ఈ రోజుల్లో డిజిటల్ వ్యవస్థ అవసరం ఉందని ఈ దిశగా పత్రికారంగం అడుగులు వేయాలని పేర్కొన్నారు.
టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను అధికారులు పాలకుల దృష్టికి తీసుకురావడంలో పత్రికలు ఎంతో కాలంగా చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అనంతరం ‘ప్రజాక్రాంతి’ దినపత్రిక ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ బిక్కి గోపి క్యాలెండర్ ను టీయూడబ్ల్యూజే యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, యూనియన్ నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షకార్యదర్శులు వి రామకృష్ణ, శెట్టి రజినీకాంత్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ మందటి వెంకటరమణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, కోశాధికారి కొరకొప్పుల రాంబాబు,నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బాలబత్తుల రాఘవ, అమరవరపు కోటేశ్వరావు, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షకార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు టీఎస్ చక్రవర్తి, ఎస్.కె జానీపాషా, మదర్ సాహెబ్, విజేత, కంచర్ల శ్రీనివాస్, యాకేష్,
వీడియో జర్నలిస్ట్ అధ్యక్షులు నాగరాజు, ప్రెస్ క్లబ్ కోశాధికారి కొరకొప్పుల రాంబాబు, ఉపాధ్యక్షులు ముత్యాల కోటేశ్వరావు, ఈశ్వరి, సాయి, వేణు, శ్రీనివాస్, నరేందర్, జీవన్ రెడ్డి, రోశిరెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శివాజీ, తిరుపతిరావు, ఆర్ కె, పానకాలరావు, గణేష్, మందుల వెంకటేశ్వర్లు, కిరణ్, జి కుమార్, బండి కుమార్, నరేష్, పురుషోత్తం, రవి, యాదగిరి, మోహన్, వేణుగోపాల్, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, కృష్ణారావు, పులి శ్రీనివాస్, ఉత్కంఠం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.