ప్రెస్ క్లబ్ నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే వివేకానంద
సాక్షిత : కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద హామీని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కుత్బుల్లాపూర్ నూతన కమిటీ మర్యాదపూర్వకంగా మంగళవారం దండమూడి ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జర్నలిస్టుల పక్షపాతిగా తాను ఉంటానని స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిందన్న విషయాన్ని జర్నలిస్టులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఎమ్మెల్యే ఫండ్స్ తో వెంటనే భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి మరోరూ. కేటాయించాలని అందుకు తగిన ప్రణాళికలను వెనువెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా ఎన్నికైననియోజకవర్గం కమిటీని అభినందించి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీద బాలరాజు, నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో నూతన అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సాయిబాబా, కోశాధికారి శేషారెడ్డి, ఉపాధ్యక్షులు కల్కి మూర్తి, సంయుక్త కార్యదర్శి మద్దయ్య, నర్సింగ్, సభ్యులు అన్వర్, శ్రీను, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రెస్ క్లబ్ నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే వివేకానంద
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…