చిలకలూరిపేట విజయాన్ని చంద్రబాబుకి కానుకగా ఇస్తా: ప్రత్తిపాటి

Spread the love

అధినేత చంద్రబాబు చేతుల మీదుగా బీఫారం అందుకున్న ప్రత్తిపాటి

చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించి అధినేత చంద్రబాబుకు కానుకగా ఇచ్చి తీరతామని స్పష్టం చేశారు మాజీమంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రవ్యాప్తంగా కూడా తెలుగుదేశం కూటమి విజయానికి చేరువుగా వెళ్తోంటే ముఖ్యమంత్రి జగన్ ప్రతి అడుగు పరాజయం, పరాభవం వైపే పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. శ్రీకాకుళంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతుల మీదుగా చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫారం అందుకున్నారు ప్రత్తిపాటి పుల్లారావు. విజయవాడలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరుకాలేకపోయారు.

ప్రస్తుతం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటిస్తుండడంతో అక్కడికి వెళ్లి బీఫారం అందుకున్నారు ప్రత్తిపాటి. ఈ సందర్భంగా విజయీభవ అంటూ ప్రత్తిపాటిని అభినందించిన చంద్రబాబు దిగ్విజయంగా గెలిచి రావాలని సూచించారు. ఇప్పటికే ప్రత్తిపాటి మొత్తం ఐదుసార్లు ఎన్నికల్లో పోటీ చేయగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆరోసారి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించాలని ప్రత్తిపాటికి చంద్రబాబు సూచించారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలుగా తమకంటే రాష్ట్ర భవిష్యత్ రీత్యా ప్రజలకే జీవన్మరణ సమస్యలాంటివి అన్నారు. పొరపాటున మళ్లీ గెలిస్తే రాష్ట్రాన్ని టోకుగా అమ్మకానికి పెట్టడానికి కూడా వెనకాడని జగన్ గ్యాంగ్ నుంచి ఏపీని, ఏపీ భవిష్యత్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ప్రత్తిపాటి పుల్లారావు.

Related Posts

You cannot copy content of this page