వేసవి తాపం నుండి పోలీస్ సిబ్బంది సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్

Spread the love

వేసవి తాపం నుండి పోలీస్ సిబ్బంది సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్


సాక్షిత ప్రకాశం జిల్లా : ఎండ తీవ్రతను రక్షణ పొందేందుకు ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ వెల్ఫేర్ కిట్లను అందజేసిన జిల్లా ఎస్పీ *
సిబ్బంది సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా వేసవి తాపం నుండి ట్రాఫిక్ సిబ్బంది రక్షణ పొందేందుకు వారికి జిల్లా ఎస్పీ సమ్మర్ వెల్ఫేర్ కిట్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో అందచేసినారు. ఈ సమ్మర్ కిట్ లో ఎండ తీవ్రత నుండి కాపాడే ట్రాఫిక్ హెల్మెట్, సమ్మర్ హ్యాట్స్, సన్/కూలింగ్ గ్లాసెస్, చల్లదనం ఉంచే వాటర్ బాటిళ్లు, ORSL ప్యాకెట్లు, అలాగే రాత్రి సమయాల్లో ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బందికి ప్రమాదాలు జరక్కుండా లైటింగ్ బ్యాటన్ మరియు రేడియం రిఫ్లెక్టింగ్ సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయి.

ఈ సందర్భముగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ సిబ్బంది నిత్యం మండుటెండలో విధులు నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుందని, తీవ్రమైన ఎండల్లో దుమ్ము, ధూళి లెక్కచేయకుండా విధులు నిర్వర్తించే వారికి వేసవి తాపం నుండి స్వీయ రక్షణ చాలా అవసరమని, ఎండకు డీహైడ్రేషన్ కాకుండా నీరు బాగా తాగాలని, వడ దెబ్బ వంటి ప్రమాదకర పరిస్థితులకు లోను కాకుండా ORSL, నిమ్మ రసం, మజ్జిగ లాంటి ద్రవాలు సేవించాలని మరియు వేసవి కాలంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రవాణా సాఫీగా సాగుటలో ట్రాఫిక్ పోలీసుల పాత్ర అత్యంత కీలకమైనదని, వేసవిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజలకి మెరుగైన సేవలందించాలని, విధి నిర్వహణలో ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

పోలీస్ సిబ్బంది సంక్షేమంలో ఎంతో శ్రద్ద తీసుకుంటూ వేసవిలో నాణ్యమైన సమ్మర్ కిట్ ను అందించిన జిల్లా ఎస్పీ కి సిబ్బంది ధన్యవాదాలు తెలియచేసినారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ట్రాఫిక్ డిఎస్పీ వి.శ్రీనివాసరావు, DSB DSP బి.మరియాదాసు, ఎఆర్ డిఎస్పీ వెంకటేశ్వరరావు, తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి, RI లు శ్రీహరి రెడ్డి, హరిబాబు మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page