Prajadivas program for speedy justice to victims
బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రజదివాస్ కార్యక్రమం
జిల్లా పోలీసు కార్యాలయంలో 11గంటల నుండి 02 గంటల వరకు నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి 14 ఫిర్యాదులు స్వీకరణ.
*జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే IPS *
*సాక్షిత * : ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..బాధితులకు న్యాయం చేయడానికి ప్రజదివాస్ కార్యక్రమాన్ని ప్రతి సోమావారం నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్ లో ప్రజల వద్ద నుండి 14 ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది అని ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని,బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.
ఫిర్యాదులు పెన్డ్డింగ్ ఫిర్యాదు దారులతో నేరుగా మాట్లాడి చట్టప్రకారం సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది అన్నారు.. సివిల్ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించడం జరిగింది అని అన్నారు
.భూమిని నమోదు చేయమని లేదా పౌర వివాదాలకు పాల్పడాలని మరియు పరిష్కారాలు చేయమని పౌరులను ఎవరైనా బెదిరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము మరియు ఇలాంటి సంఘటనలకు సంబంధించి ప్రజలు మా కార్యాలయానికి వచ్చి పిర్యాదు చేయవచ్చు అని అన్నారు.
.సివిల్ తగాధల్లో ఏ అధికారి కూడా తలదూర్చకుడదని ఏ అధికారి ఐన సివిల్ తగాధల్లో ఇబ్బందికి గురిచేస్తే నేరు గా జిల్లా పోలీస్ కార్యాలయంలో పిర్యాదు చేయవచ్చు అని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు..