పవర్ ‘చేతి కి’ వచ్చింది…
డివైడర్ ‘అడ్డు’ తొలిగింది…
*సాక్షిత : *’దటీజ్ దామన్న’ అంటున్న ప్రజలు
మెయిన్ రోడ్డు లో డివైడర్ వల్ల గోస పడ్డ ప్రజలకు విముక్తి కల్పించిన దామన్న
నల్లాల బావి నుండి పోల రాములు మిల్లు ద్వారా శివాలయం రాజీవ్ నగర్ వరకు వెళ్లే ప్రజల కోరిక మేరకు, మెయిన్ రోడ్డు వ్యాపారస్తుల విన్నపం మేరకు *మాజీమంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి * ఆదేశం మేరకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కి మెయిన్ రోడ్డులో డివైడర్ తొలగించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఇచ్చిన వెంటనే మున్సిపల్ అధికారులు మెయిన్ రోడ్డు వద్దకు విచ్చేసి డివైడర్ను తొలగించారు. ఈ సందర్బంగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు డివైడర్ తొలగించడం వల్ల ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు తొలిగిపోయాయని మెయిన్ రోడ్డు వెడల్పు అసంబద్దం గా జరిగింది అని, త్వరలోనే మెయిన్ రోడ్డు వ్యాపారస్తుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.