లోహిత్ జ్యూయలరీ మార్ట్ ను ప్రారంభించిన పొంగులేటి

Spread the love

Ponguleti who started Lohit Jewelery Mart

లోహిత్ జ్యూయలరీ మార్ట్ ను ప్రారంభించిన పొంగులేటి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తల్లాడ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన లోహిత్ జ్యూయలరీ మార్ట్ ను గురువారం ప్రారంభించారు. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా సేవలను అందిస్తూ వారి మన్ననలను అందుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పొంగులేటితో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ బాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, తూము వెంకటనారాయణ, గొడుగునూరి లక్ష్మారెడ్డి, గుర్రం శేషగిరి రావు, జువ్వాజి నర్సింహారావు తదితరులు ఉన్నారు.

కొత్తగూడెం నియోజకవర్గంలో పొంగులేటి పర్యటన

ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నియోజకవర్గంలో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా సుజాతనగర్ మండలం వేపలగడ్డ, రాఘవాపురం, కొత్తగూడెంలోని విద్యానగర్, లక్ష్మీదేవిపల్లి మండలం తెలగరామవరం, చుంచుపల్లి మండలం రామాంజనేయపల్లి, పాల్వంచ పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన వివాహా వేడుకలతో పాటు పలు ఇతర శుభకార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.

పట్టువస్త్రాలను కానుకగా సమర్పించారు. పలు బాధిత కుటుంబాలను ఓదార్చి ఆర్థికసాయాలను అందజేశారు. అదేవిధంగా పలు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ బాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, విజయ బాయి, ఆళ్ల మురళి, తూము చౌదరి, లేళ్ల వెంకట రెడ్డి, లింగం పిచ్చిరెడ్డి, ఉడుముల శ్రీనివాస రెడ్డి, మైనారిటీ నాయకులు రజాక్ భాయ్, గౌస్ భాయ్, నర్సింహా, రాము, ప్రశాంత్, తిరుపతి రావు, బి. రవీందర్, చింతా నాగరాజు, ఇజ్జగాని రవిగౌడ్, సత్తిరెడ్డి, దుర్గరాశి సతీష్, నాగేశ్వర రావు, లక్ష్మా రెడ్డి, చల్లా నాగేశ్వర రావు, ఉ పేందర్, గోపాల్ రెడ్డి, తాటి వెంకన్న, సామ్య నాయక్,

పరపతి భద్రయ్య, బొల్లం రామయ్య, దేవరగట్ల ప్రసాద్, తాళ్లూరి షణ్ముఖ చారి, దేవరగట్ల ప్రమోద్, ప్రసాద్, బాలు, చిమట సూరయ్య, దొంతుల నగేష్, దొంతుల విజయ్, చిమట అప్పారావు, కృష్ణవేణి, కె. రామచందర్ గౌడ్, రవిభాస్కర్, అక్బర్, లక్ష్మయ్య, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page