SAKSHITHA NEWS


Politician’s Confrontation Picture”

రాజకీయ నాయకుల పరామర్శ లుచిత్రం”
ప్రజాసందర్శనం భలే విచిత్రం”

లోడిగ. వెంకన్నయాదవ్- సామాజిక వెత్త. పాలేరు.!

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

అలనాడు రాజులకాలంలో రాజుగారు ప్రజాసందర్శనం సందర్భంగా బయటకు వచ్ఛినప్పుడు “రాజు వెడలే రవి తేజము లలరగ…. కత్తులు కటారులు తళతళ మెరువగా” అన్నట్టుగా ఈనాడు రాజకీయ నాయకులు ప్రజలను సందర్శించడానికి వెళ్ళుతున్నతీరు రాజుల కాలంలా తలపించేలాఉంది. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ సందర్భం ఏదైనా సరే నాయకుడు మా ఇంటికి రావాలి అని కార్యకర్తలు అనుకోవడం లో తప్పులేదు. కాని అన్నిరాజకీయ పార్టీ ల ముఖ్య నాయకులందరు మా ఇంటికి రావాలి అని కార్యకర్తలు కోరుకొంటున్నారు.

వెళ్ళడానికి నాయకులు కూడ ముచ్ఛటపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా నాయకులు వెళ్ళుతున్నతీరు అక్కడి పరిస్థితి గమనంలో లేకుండా చూపురులను రోతపుట్టించేలాఉన్నాయి. ముఖ్యకార్యర్తల కుటుంబం లోఎవరైనా చనిపోతే చూడటానికి వెళ్ళుతున్న నాయకుడి వెంట కార్లు సైకిల్ మోటారు ర్యాలీ అక్కడి కి చేరుకొనేటప్పటికి విశాదఛాయలు అలుముకున్న ఆ ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా అలజడి మొదలౌతుంది.

నాయకుడు వస్తున్నాడు అని ఏడుపు మొదలైన ఇంట్లో అది మరచి నాయకుడికోసం ఆరాటపడుతుంటారు ఒక్కసారిగా శవాన్ని వదిలేసి నాయకుడికి స్వాగతం పలికే పనిలో నిమగ్న మైపోతున్నారు. జరగండి..జరగండి అని ఒక అలజడి వాతావరణం ఏర్పడేలాతయ్యారు అవుతుంది. అంతటితో ఆగక నాయకుడు శ్రద్దాంజలి గటించి శవానికి దండ వేసేసమయములో ఫోటోగ్రఫీ ,సెల్ ఫోన్ లో ఫోటో లకోసం ఫోజులు ఇచ్ఛే కారిక్రమము జరుగుతుంది. ఆ కుటుంభానికి ఒక వేళ్ళ ఆర్థిక చేయూత నివ్వవల్సిన పరిస్థితి వచ్ఛినప్పుడు, ఆ నాయకుడు ఓదార్పు సమయంలో శవం ప్రక్కన ద్వితీయ శ్రేణి నాయకుల హడావుడి అంతాఇంతా కాదు. నాయుడు వెనుదిరిగి వెళ్ళే సమయంలో కుటుంబ సభ్యులు అందరూ శవాన్ని వదిలేసి నాయకుడి కారువద్దకు వెళ్ళి ఊపిరి సలపకుండా కారుచుట్టుచేరి వంగివంగి దండాలు పెట్టి నాయకుడిని సాగనంపుతారు.

ఇదంతా చూస్తుంటే మనం ఎటువైపు పయనిస్తున్నాము అని పిస్తుంది. ఇంటి విశాద ఛాయలు ఎటువైపు తీసుకెళ్లుతున్నామొ చూపురులను ఆలోచింపచేస్తున్నాయి. అంతటితో ఆగక మరలా మరోనాయకుడికోసం ఎదురుచూపులు.ఇలా దహనసంస్కారాలు అయ్యేవరకు ఇదేతంతు. ఆ వెనువెంటనే ఫేస్బుక్స్, వాట్సప్ లో తీసిన ఫోటోలు చక్కర్లు కొట్టేలా ఒకరికి పదిమంది అదే పనిగా సోషల్ మీడియాలో పోస్టింగులు. చనిపోయిన దెగ్గరి నుండి దినఖర్మాలయ్యే వరకు ఏనాయకుడు పరామర్శ కు రాలేదో ఆ నాయకుడి పి.యే,కి ద్వితీయ శ్రేణి నాయకులు వారి ఇష్టమైన నాయకులు వచ్ఛే వరకు ఒకటే ఫోన్ లు.

పెండ్లి దెగ్గరి నుంచి పదహారు రోజుల పండగ వరకు ,చావుదెగ్గరి నుంచి అంటుతలకల వరకు ఇదే తంతు.!
ఇదంతా ఒక ఎత్తు కాగా వచ్ఛే అథితులకు రుచికరమైన వంటకాలు తమ నాయకుడు తినిపోయేవరకు ఒకటే హడావుడి. గతంలో పిలవకుండా ఏఒక్కరు గ్రామాల్లో భోజనాలకు వచ్ఛేవారు కాదు. కాని ఇప్పుడు ఏవర్ని ఎవరు పిలిచారో తెలియదు గాని వండిన వంటకాలు ఊడ్చిపడేస్తున్నారు.ఈ రద్దీని తట్టుకోటానికి కుటుంబికులు వేలమంది కి అంచనా తెలువకుండా వంటకాలు వండిస్తున్నారు. సామాన్య మానవుడికి ఇది పెను భారంగా మారిపోతుంది.!


ఇదంతా ఎవరికోసం ,ఎవర్ని పిలిచాము ,ఎవరు వచ్ఛారు అని టెంట్లు కిందపడేసినాకా లెక్కలు మొదలేయటం మొదలౌతుంది. అదిపెండ్లయినా ,చావైనా సరే ఇదే వరస.ఇంకో అడుగు ముందుకు వేసి వచ్ఛేనాయకుల సౌకర్యార్థం పెక్సీలు ,బ్యానర్లు ,బారికేడ్ల,కటౌట్లు ,తమ ఇంటినుండి రహదారి పోడువునా ఇండికేడ్స్ రంగురంగుల డిజైన్లు తో అందంగా అలంకరిస్తున్నారు. మన ఇంటి కోసం , మన కుటుంబం కోసం నిర్వహించుకొనే ఆనందం ,విశాదవేడుకలు వికృత చేస్టలతో సందర్భం మరచి ఇంటి వాతావరణం, సాంప్రదాయం , సంస్కృతిని ఆదమరచి ఆనందహేళగా ,ఎవరిమెప్పునో పొందటానికి అర్రులు చాచి వెర్రితలలు వేస్తున్నాము.!


ఇదిగమనించిన రాజకీయ నాయకులు గెలిచేవారు, భౌషత్ లో ప్రజాప్రతి నిధులుగా గెలుస్తాను అన్ననమ్మకంతో నాయకులు గ్రామాల్లో కి రావటానికి ఇష్టపడుతున్నారు. వారికి లభిస్తున్న ఆదరణ, గౌరవం మర్యాద టన్నుల కొలది కార్యకర్తలదెగ్గర లభిస్తుంది గనుక అది పెండ్లయినా చావైనా పంచకట్టు ఓణీల పంక్షన్ అయినా సందర్భం ఏదైనా , సమయం ఎప్పుడైనా రాజకీయ నాయకులు రావడానికి క్యూ కడుతున్నారు. ప్రజాసమస్యలపై ప్రజలు నాయకుల వద్దకు ,ప్రజాప్రతినిధుల ఇండ్లవద్దకు ఉదయాన్నే వెళ్ళేవారు. కాని సమస్యలు గాలికి వదిలేసి మా కూతురి పెడ్లి ,మా ఇంటి గృహప్రవేశం ,ఇంట్లో శుభకార్యానికి మాఇంటికి రావాలి అని కుటుంబ సభ్యుడు ,ఆగ్రామ నాయకుల ను వెంటబెట్టుకుని నాయకుల ఇండ్ల వద్దకు చేరుకొంటున్నారు. ఉదయాన్నే నాయకుడి ఇంటి ముందు ఆహ్వన కార్డులు తీసుకొనటానికి ఒక ప్రజాధర్భారును తలపించేలా ఉంటుంది. కార్డులు ఇచ్ఛింది కాక కార్డులు ఇచ్ఛెటప్పుడు నాయకుడితోమరల ఒకఫోటో సెషన్స్.

ఇదంతా నాయకులు కూడ ఇష్టపడి ఉత్సహపడి పరుగులు తీస్తున్నారు. ఇటీవల ఒక జిల్లా మాజీ మంత్రికి వచ్ఛిన ఆహ్వాన పత్రికలు చూస్తే వెళ్ళిరావడానికి , తిరిగి రావటానికి సంవత్సరం కాలం సరిపోదనటంలో సందేహం లేదు , అతిశయోక్తికాదు.ఇదంతా గ్రామాల్లో ఒకఫ్యాషన్ గా మరిపోయింది. ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తోందిఅని చెప్పవచ్చు. అయినా పర్వలేదు.కాని ఇంటివాతవరణం పరిస్థితిని మరిచి , సందర్భంనకు తగ్గట్టుగా సాంప్రదాయం అనుగుణంగా వేడుకలు జరుపుకొంటే మంచిది అని ప్రజలు అనుకొంటున్నారు. దీనిని కాపాడవల్సిన బాధ్యత రాజకీయ నాయకుల పై కూడ ఉంది.

మమ్ముల్ని గౌరవిస్తున్నారు , విలువ ఇస్తున్నారు అని మీరు క్యూ కడితే సాంప్రదాయ విలువలు మంటకలిపిన పాపంలో మీకు వాటా ఉంటుందని రాజకీయ నాయకులు గుర్తించాలి. నాయకులు మన ఇంటికి వస్తే మనకు గౌరవం ,మన కుటుంబానికి గౌరవం, ఇతరులకు ఇబ్బందులు తెచ్ఛిపెట్టే గౌరవాలు అక్కరలేదు అని కార్యకర్తలు గుర్తించిననాడు గ్రామానికి గౌరవం , మీకు గౌరవం నాయకునికి గౌరవం అని సభ్యసమాజం హితవు పలుకుతుంది.ఇది గమనించి వేడుకలు జరుపుకొంటారని ఆశిద్దాం.


SAKSHITHA NEWS