కర్నూల్ జిల్లా:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
తెల్లవారు జామున కర్నూలు జిల్లా సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసు అధికారులకు వచ్చిన సమాచారంతో తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాదు నుండి బెంగుళూరు వెళుతున్న కెఎస్ఎం ప్రవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న అనంత ఇంజనీరింగ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీకి చెందిన జిలానీ, సుమన్ అనే వ్యక్తుల నుండి ఏలాంటి ఆధారాలు లేని రూ. 60 లక్షల నగదు ను కర్నూలు తాలుకా, సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సీజ్ చేసిన 60 లక్షల నగదు ను రెవిన్యూ అధికారుల సమక్షంలో మొత్తాన్ని అప్పగించారు.ఈ తనిఖీల్లో పాల్గొన్న కర్నూలు తాలుకా సిఐ శ్రీధర్ , సెబ్ ఎస్సై పృథ్వీరాజ్ పోలీసు సిబ్బంది ని జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ప్రత్యేక అభినందించారు