శరత్‍ను అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలీసులు..

Spread the love

మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‍ను అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలీసులు…!

రిమాండ్‍పై రెండు గంటల పాటు కొనసాగిన వాదనలు…

ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి…

14 రోజులపాటు రిమాండ్ విధించిన న్యాయమూర్తి…

శరత్‍ను విజయవాడ సబ్ జైలుకు తరలించిన పోలీసులు…

వేయని రోడ్లకు ప్రభుత్వం నుంచి ఇన్‍పుట్ టాక్స్ క్రెడిట్‍గా పొందినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడి…

తెల్లవారుజాము వరకు జడ్జి నివాసం దగ్గరే ఉన్న టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, గద్దె రామ్మోహన్, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజా, బోడే ప్రసాద్, పట్టాభిరామ్, పిల్లి మాణిక్యరావు, కనపర్తి శ్రీనివాస్, ఇతర నేతలు…

ప్రత్తిపాటి శరత్ తరపున వాదనలు వినిపించిన బెనర్జీ, లక్ష్మీనారాయణ…

ఇదే తరహా కేసు తెలంగాణలోనూ నమోదైనట్లు జడ్జికి తెలిపిన న్యాయవాదులు…

ఒకే తరహా నేరంపై రెండు FIRలు పెట్టడం నిబంధనలకు విరుద్ధం…

సెక్షన్ 409 ఈ కేసులో వర్తించదంటూ తిరస్కరించిన న్యాయమూర్తి.

Related Posts

You cannot copy content of this page