
police-in-veenavanka-mandal
కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిధిలోని అన్ని గ్రామాల యువతకు వాట్సప్ గ్రూప్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని వీణవంక పోలీస్ స్టేషన్ లో SI శేఖర్ రెడ్డి నిర్వహించగా.. ముఖ్య అతిథిగా హాజరైన జమ్మికుంట రూరల్ సీఐ సురేష్ మాట్లాడుతూ ..
యువత వాట్సాప్ గ్రూపులలో సందేశాలను ఎవరు కించపరిచే విధంగా పెట్టవద్దు అని సూచించారు. ఏ సందేశమైన ఏ రాజకీయ పార్టీనీ కించపరిచే విధంగా ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ఉండేలా చూసుకోవాలని సూచించారు. గ్రూపులో చాటింగ్ ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగితే వారు ఫిర్యాదు చేయడం జరుగుతుందని దానివల్ల యువత బంగారు భవిష్యత్తును నాశనం అవుతుందని తెలిపారు.
