ఖమ్మంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపందా నాయకులను పోలీసులు అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపడాన్ని ఖండించండి సిపిఐ ఎంఎల్ ప్రజాపంద జిల్లా కార్యదర్శి కెచేల రంగారెడ్డి విజ్ఞప్తి
ఖమ్మం పట్టణానికి చెందిన సిపిఎంఎల్ ప్రజాపందా నాయకులు ఆవుల అశోక్ , బి.పుల్లయ్య, లక్ష్మణ్. జి అశోక్ ,హనుమంతరావు .శ్రీను లపై ఒక హోటల్ యజమానితో జరిగిన వివాదాన్ని ఆసరా చేసుకుని పోలీసులు కేసు బనాయించి జైలుకు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కెచ్చెల రంగారెడ్డి అన్నారు భద్రాచలంలోనీ అశోక్ నగర్ కాలనీలో గల ప్రజా పంద ఆఫీసులో జరిగిన ముఖ్య కార్యకర్త నిరసన సభలో కెచ్చెల రంగరెడ్డి మాట్లాడారు సమావేశంలో తీవ్రంగా ఖండించారు అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని. జైలు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో పాలకులు మారిన పోలీసుల వైఖరి మారలేదని కెచ్చెల రంగారెడ్డి విమర్శించారు ఇప్పటికైనా పాలకులు పోలీసులను దారిలో పెట్టాలని కోరారు లేనియెడల భవిష్యత్తులో ఉద్యమాలకు పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు
ఈ నిరసన కార్యక్రమంలో కేచేల రంగారెడ్డి గారితో పాటు జిల్లా నాయకురాలు కేచ్చల కల్పన,డివిజన్ నాయకులు మునిగల శివ ప్రశాంత్,మునిగాల మహేశ్వరి ,కుమారి ,రమ ,నాగరత్నం ,రేవతి ,స్వాతి, శాంతక్క, ఎస్.కె నసీమా,చిన్న తల్లి ,వరలక్ష్మి ,బ్లెస్సి .తదితరులు పాల్గొన్నారు.