సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
మహాశివరాత్రి సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంలోని తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని పోలీస్ కమిషనర్ సందర్శించారు. జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుడా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు.
నిర్వహుకులు ఆలయ స్వాగత ద్వారం మొదలుకొని గర్భాలయం వరకు క్యూలైన్లు, చలువ పందిళ్లు, పరిసరాలు తిరిగి పరిశీలించారు.సీసీ కెమెరాలు ఏర్పాటు, పార్కింగ్, ఆర్టీసీ బస్ స్టాప్, తదితర ప్రాంతాల దగ్గర బారికేట్ల ఏర్పాటు పరిశీలించి తగిన సూచనలు చేశారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. స్నానపు ఘాట్ , ఇతర ప్రాంతాలలో నిరంతర విద్యుత్ కోసం ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేవిధంగా అధికారులతో సమన్వయం చేసుకొవాలని సూచించారు. భక్తుల వాహనాల పార్కింగ్ కోసం కేటాయించిన స్ధలంలో వాహనాలు నిలిపే విధంగా చర్యలు తీసుకొవాలన్నారు.
కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, ఏస్బీ ఏసీపీ ప్రసన్న కుమార్, రూరల్ సిఐ రాజిరెడ్డి పాల్గొన్నారు.