బాపట్ల జిల్లా సివిల్ సప్లైస్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం

Spread the love

బాపట్ల జిల్లా సివిల్ సప్లైస్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన బాపట్ల జిల్లా ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ బత్తుల శామ్యూల్

బాపట్ల పట్టణం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ఈరోజు ఎఐటియుసి జనరల్ సెక్రటరీ బాపట్ల జిల్లా బత్తుల శామ్యూల్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది జిల్లా లోని అన్ని మండలాలు నుండి పెద్ద ఎత్తున హమాలీ వర్కర్స్ ధర్నా నిర్వహించారు
దీనిలోని ప్రధానాంశాలు పౌరసరఫరాల శాఖలో పైలెట్ ప్రాజెక్టు గురించి మరియు డైరెక్ట్ మెంట్ గురించి ప్రస్తావించిన అంశాలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పరిధిలో నీ మండల స్టాకు పాయింట్లు నందు గత 36 సంవత్సరాలుగా లోడింగ్ అన్లోడింగ్ పనులు నిర్వహిస్తున్న హమాలీ కార్మికులు ఈ పనినే నమ్ముకొని బ్రతుకుచున్నారు గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చినప్పటికీ సివిల్ సప్లై కార్పొరేషన్ సిబ్బందిని మార్చలేదు పిడిఎస్ ద్వారా ప్రభుత్వాలకు ఆహార పదార్థాలను అందించేవారు దీనిని చాలా జాగ్రత్తగా గత ప్రభుత్వాలు నడిపినాయి కానీ నేడు ఎవరో కొద్దిమంది ఏవో సలహాలు ఇచ్చారని అందులో అనేక మార్పులు చేస్తున్నారు ముఖ్యంగా ఇందులో పనిచేస్తున్న హమాలీ కార్మికుల జీవన భృతికి చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నారు. బఫర్ గోడౌన్ నుండి డైరెక్ట్ గా డీలర్ కు షాపులకు బియ్యం సరఫరా చేయుటకు పూనుకొన్నారు. ఇప్పటికే కాకినాడ శ్రీకాకుళంలో పైలెట్ ప్రాజెక్టు పథకం కింద ఈ రెండు చోట్ల డైరెక్టు మూమెంట్ ప్రారంభించారు ఇప్పుడు రెండో విడతగా ఇతర జిల్లాలలో కూడా ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నారు దీనిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఇప్పటికే మాకు సివిల్ సప్లై వారు ఐదువేల మంది మాది వర్కర్స్ కి పిఎఫ్ ఇచ్చి ఉన్నారు ఈ పద్ధతి ఇలానే కొనసాగితే మాకు ఉపాధి లేకుండా పోయి మా కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉన్నది కనుక దీనితోపాటు మాకు వచ్చే పిఎఫ్ కూడా రాకుండా ఆగిపోతుంది కావున ఈ డైరెక్టు మూమెంట్ పైలెట్ ప్రాజెక్టు పథకం కాకినాడ శ్రీకాకుళం లో జరిగేవి రద్దు చేయవలసిందిగా కోరుచున్నాము మా ఇబ్బందులను గుర్తించి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయగలరని బాపట్ల జిల్లా ఏఐటీయూసీ ద్వారా విన్నవించుకొనుచున్నాము ఈ కార్యక్రమంలో కందుల శంకర్రావు, శ్రీను, అప్పన్న, సుబ్బారెడ్డి, పులి శీను, వెంకటరెడ్డి, నిమ్మ శీను, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page