జేపీఎస్ ల సమస్యల పరిష్కారం కోసం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం

జేపీఎస్ ల సమస్యల పరిష్కారం కోసం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం

SAKSHITHA NEWS

జేపీఎస్ ల సమస్యల పరిష్కారం కోసం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం

చిట్యాల సాక్షిత ప్రతినిధి

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని కోరుతూ గత వారం రోజులుగా వివిధ కోణాల్లో నిరసన తెలుపుతున్నారు. అందులో భాగంగా బుధవారం రోజు తమ డిమాండ్లను నెరవేర్చాలని, తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని కోరుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జ్యోతీరావు ఫూలే, బాబుజగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి వినతి పత్రాన్ని సమర్పించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్యదర్శులు మాట్లాడుతూ 4సంవత్సరాల ప్రోబెషన్ కాలాన్ని సర్వీస్ గా గుర్తించి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS