లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

SAKSHITHA NEWS

లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి.

-జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు.    ఖమ్మం, నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి  లే అవుట్‌ అప్రూవల్‌ కమిటీ సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ, సుడా పరిధిలో లే-అవుట్‌ ఆమోదం కొరకై అందిన (11) దరఖాస్తులను కమిటీ సమావేశంలో పరిశీలించారు.  నిబంధనల మేరకు సమర్పించబడిన దరఖాస్తులను కమిటీ ఆమోదం తెలిపింది.  

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ. జిల్లాలో లే-అవుట్ల ఆమోదం కొరకు రెవెన్యూ, విద్యుత్‌, నీటి పారుదల, రోడ్లు భవనాల, టౌన్‌ ప్లానింగ్‌ తదితర అనుబంధ శాఖల నుండి అనుమతులకై సమర్పించిన దరఖాస్తులను 21 రోజుల లోపు ఆయా శాఖలకు సంబంధించిన అనుమతులను జారీచేయాలని, తదనుగుణంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదించడం జరుగుతుందని అన్నారు.   గ్రీనరీ కొరకు కేటాయించిన స్థలాన్ని వెంటనే స్వాధీనపర్చుకొని మొక్కలు నాటాలన్నారు. 


అనుమతులు జారీకి సంబంధిత శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన పిదపనే అనుమతులు జారీచేయాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు.  లేఅవుట్‌ డెవలపర్స్‌ కూడా నిబంధనల మేరకు చట్టబద్దంగా సమగ్ర ప్రణాళికబద్దంగా ల్యాండ్‌ డెవలప్మెంట్‌ పనులు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి,  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి, శిక్షణ కలెక్టర్‌ రాధిక గుప్తా, ఇరిగేషన్‌ సి.ఇ. శంకర్‌ నాయక్‌, రెవిన్యూ డివిజనల్‌ అధికారి రవీంద్రనాధ్‌,  జిల్లా పంచాయతీ అధికారి అప్పారావు,  సర్వే అండ్ ల్యాండ్ రికార్డు ఎ.డి. శ్రీనివాసులు,ఎస్. ఇ. అర్ అండ్ బి. లక్షమన్, పంచాయితీ రాజ్‌ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కె.వి.కె. శ్రీనివాస్, మధిర, వైరా, మునిసిపల్‌ కమీషనర్‌లు రమాదేవి, అనిత, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, వైరా రఘనాథపాలెం, తహశీల్దార్లు శైలజ,సుమ, అరుణ నరసింహారావు, ఇరిగేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *