SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 13 at 4.15.36 PM

ఎంపీ నామ ఆలోచన అత్యద్భుతం

నామ ఆధ్వర్యంలో సమస్యలపై కేంద్ర మంత్రులకు వినతులు

నామకు ధన్యవాదాలు

……..

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు నేతృత్వం..నిర్దేశకత్వంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు విడతల వారీగా న్యూఢిల్లీకి విజ్ఞాన యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన జెట్పీటీసీలు, ఎంపీపీ లు, పార్టీ మండల అధ్యక్షులు న్యూఢిల్లీ విజ్ఞాన యాత్ర ముగించుకుని వచ్చిన సంగతి విదితమే. అయితే తాజాగా మలి విడతలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన జెట్పీటీసీలు, ఎంపీపీ లు, మండల పార్టీ అధ్యక్షులు న్యూఢిల్లీకి ఏపీ ఎక్స్ ప్రెస్ లో ఖమ్మం నుంచి గురువారం బయలు దేరి వెళ్లారు. వీరంతా అక్షరధామం, రెడ్ పోర్ట్, తాజ్ మహల్ , పార్లమెంట్, తదితర తదితర చారిత్రక ప్రదేశాలను సందర్శించి, విజ్ఞానాన్ని సముపార్జిస్తారు. అంతేకాకుండా నామ నాగేశ్వరరావు నేతృత్వంలో సమస్యలపై కేంద్ర మంత్రులను కూడా కలుస్తారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు చారిత్రక అంశాలను అక్కడి వారిని అడిగి తెలుసుకొని. విజ్ఞాన విషయాలను మననం చేసుకుంటారు.ఆగ్రా వెళ్లి అబ్బురపర్చే తాజ్ మహల్ కట్టడ సౌందర్యాన్ని కూడా తిలకిస్తారు.ఈ నెల 17వ తేదీ వరకు ఈ విజ్ఞాన యాత్ర కొనసాగుతుందని ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయం తెలిపింది.

నామకు ధన్యవాదాలు

ఎంపీ నామ నాగేశ్వరరావు ఎంతో ముందు చూపుతో విజ్ఞాన సముపార్జన కోసం, విజ్ఞాన యాత్ర ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఎంపీ నామ నాగేశ్వరరావుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. నామ ద్వారా వివిధ సమస్యలపై కేంద్ర మంత్రులను కలసి వినతి పత్రాలు అందించడం జరుగుతుందని ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఎంపీ నామ చలువ వల్లనే తాము న్యూఢిల్లీ వెళ్లి ఎన్నో తెలియని చారిత్రక కట్టడాలను సందర్శించే అదృష్టం కలిగిందని చెప్పారు. పుస్తకాల్లో చదివిన చారిత్రక కట్టడాలను స్వయంగా చూసి, ఎంతో అనుభూతిని పొందడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు.సొంత ఖర్చుతో తమకు విజ్ఞాన యాత్ర ఏర్పాటు చేసిన ఎంపీ నామ నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు … ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని పేర్కొన్నారు.

నామ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులకు వినతులు

ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు ఎంపీ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో రోడ్లు, రైల్వే, పామాయిల్ రైతుల సమస్యలతో పాటు భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్, జిల్లాలో కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఏర్పాటు, తదితర సమస్యలపై పలువురు కేంద్ర మంత్రులను, సంబంధిత ఉన్నతాధికారులను కలసి లేఖలు అందజేస్తారు. ఈ విడత విజ్ఞాన యాత్రలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు (పాల్వంచ), సొసైటీ అధ్యక్షులు మండే వీర హన్మంతరావు, అన్నపురెడ్డిపల్లి అశ్వారావుపేట, దమ్మపేట, పాల్వంచ , చండ్రుగొండ, లక్ష్మీదేవిపల్లి, ములకలపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు, బండి పుల్లారావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, పూసల విశ్వనాధం,మల్లెల శ్రీరామ్మూర్తి, మంతపురి రాజుగౌడ్, దారా వెంకటేశ్వరరావు, కొట్టి వెంకటేశ్వరరావు, మోరంపూడి అప్పారావు, జెట్పీటీసీలు పైడి వెంకటేశ్వరరావు( దమ్మపేట ) , బరపాటి వాసుదేవరావు ( పాల్వంచ ) , భరత లాలమ్మ, భరత రాంబాబు , భరత లాస్యశ్రీ ( అన్నపురెడ్డిపల్లి ) , జెట్పీ కో ఆప్షన్ సయ్యద్ రసూల్, ఎంపీపీ లు జల్లేపల్లి శ్రీరామ్మూర్తి( అశ్వారావుపేట ) , మేడి సరస్వతి ( పాల్వంచ), మట్ల నాగమణి( ములకలపల్లి, భూక్యా సోన ( లక్ష్మీదేవిపల్లి ) , భూక్యా బాలాజీ , పాయం లలిత , సున్నం ప్రసాద్ ( అన్నపురెడ్డిపల్లి) , సోయం ప్రసాద్ ( దమ్మపేట) , కొత్తగూడెం కు చెందిన పాటిబండ్ల వీరవర ప్రసాద్ విజ్ఞాన యాత్రలో ఉన్నారు.


SAKSHITHA NEWS