వైద్యాధికారిని డాక్టర్ స్వరూపరాణి
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నడంతో ప్రజలు రైతులు వ్యవసాయ కూలీలు ఇటుక బట్టి నిర్మాణ కూలీలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని మల్దకల్ వైద్యాధికారిని డాక్టర్ స్వరూపరాణి సూచించారు. బుధవారము మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.43 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతున్నడంతో గ్రామాలలో ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం మంచిదని, అత్యవసర పరిస్థితులలో వెళ్లాల్సి వస్తే గొడుగు,సన్ గ్లాసెస్,చెప్పులు ధరించాలని ఆమె అన్నారు. చెమట ద్వారా నీరు బయటకు ఎక్కువ మొత్తంలో వెళ్ళిపోతున్నది కావున ఓఆర్ఎస్,నిమ్మరసం, మజ్జిగ,కొబ్బరిపాలు త్రాగాలని ఆమె పేర్కొన్నారు. గర్భిణీలు పసిపిల్లలు వృద్ధులు గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు వడదెబ్బ తగిలే అవకాశం ఉందని,వారు ఎక్కువ జాగ్రత్తలు ఉండాలన్నారు. వడదెబ్బ లక్షణాలు.. వాంతులు తలనొప్పి,అలసట, కండ్లు తిరగడం లక్షణాలు ఉంటాయన్నారు.