ప్రజా సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్న BRS పార్టీ కే ప్రజలు పట్టం కట్టాలి…BRS అభ్యర్థి కేపీ.వివేకానంద ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో BRS అభ్యర్థి కేపీ.వివేకానంద కి మద్దతుగా ఘనంగా ప్రచారం నిర్వహించారు. భౌరంపేట్ 16వ వార్డ్ లో ప్రతీ ఇంటికి తిరుగుతూ BRS పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలను వివరిస్తూ కేపీ.వివేకానంద ని హ్యాట్రిక్ MLA గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భౌరంపేట్ PACS చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , డైరెక్టర్ లు సత్తిరెడ్డి , మహిపాల్ రెడ్డి , BRS సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి , BRS పార్టీ 16వ వార్డ్ కమిటీ అధ్యక్షులు మన్నే శేఖర్ , మైనార్టీ కమిటీ అధ్యక్షులు అక్రమ్ , SC కమిటీ అధ్యక్షులు కొమ్ము గణేష్ , యూత్ కమిటీ అధ్యక్షులు పర్శ మహేష్ యాదవ్ , BC కమిటీ అధ్యక్షులు కుమ్మరి మల్లేష్ మరియు నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.