SAKSHITHA NEWS

ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలి…

కుత్బుల్లాపూర్ మండల తహసిల్దార్ & జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనంను ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ లో దాత మాతృభూమి సంస్థ చైర్మన్ వై.యాదగిరి రెడ్డి రూ.1.01 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన కుత్బుల్లాపూర్ మండల తహసిల్దార్ మరియు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనంను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ & ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్సీ నవీన్ రావు , ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మరియు జిల్లా కలెక్టర్ డి.అమోయ్ కుమార్ (ఐఎఎస్) , జాయింట్ కలెక్టర్ నర్సింహా రెడ్డి , స్థానిక ఎమ్మార్వో సంజీవ రావు , కార్పొరేటర్ రావుల శేషగిరి రావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధునాతన సౌకర్యాలతో నూతన భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేసిన దాత వై.యాదగిరి రెడ్డి ని ఘనంగా సన్మానించి అభినందించారు.

అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని, తద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలన్నారు. రెవెన్యూ అంటే ప్రజలకు సదాభిప్రాయం కలిగే విధంగా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేలా సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మల్లయ్య, ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, సెక్రెటరీ గౌతం కుమార్, జిల్లా అధ్యక్షుడు సుధాకర్, సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి, ఎమ్మార్వోలు సురేందర్, గోవర్ధన్, పద్మప్రియ, నిర్మల, కలెక్టరేట్ సూపరింటెండెన్ట్ రాజేశ్వర్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకటేష్ రావు మరియు కార్పొరేటర్లు, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్, డివిజన్ల అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS