SAKSHITHA NEWS

సాక్షిత : ప్రజలు సంతోషంగా ఉండాలి, పండుగలు గొప్పగా జరుపుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వినాయక చవితి సంధర్భంగా ఆయన బుధవారం ఖైరతాబాద్ గణనాధుడిని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, MLA దానం నాగేందర్ లతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహకులు మంత్రిని శాలువాతో సన్మానించారు. అదేవిధంగా సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్ లో స్వామి వారిని దర్శించుకొన్నారు. ముందుగా ఆలయ పండితులు మంత్రికి పూర్ణ కుంభం, వేదమంత్రాలతో స్వాగతం పూజల అనంతరం మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తుందని చెప్పారు. దేశంలోనే ప్రత్యేకత కలిగిన హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వివరించారు.


SAKSHITHA NEWS