శాంతిభద్రతలు దిగజారిన మణిపూర్‌లో ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు తక్షణం జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళవారం లేఖ రాశారు. గత 18 నెలలుగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా దిగజారినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చక్కదిద్దడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. మరోవైపు, మణిపూర్‌లో ఎన్డీయే ఎమ్మెల్యేలు 27 మంది ఆ రాష్ట్రంలోని జిరిబమ్ జిల్లాలో మహిళలు, పిల్లల హత్యలకు కారకులైన కుకి మిలిటెంట్ల కోసం ప్రత్యేక ఆపరేషన్ జరపాలని తీర్మానించారు. మణిపూర్ హక్కుల కార్యకర్త ఇరోం షర్మిల ఆ రాష్ట్ర సీఎం బీరేన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని స్వయంగా జోక్యం చేసుకొంటే తప్ప పరిస్థితులు చక్కబడవని తెలిపారు. కాగా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ అమలుచేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇంపాల్ పశ్చిమ జిల్లాలో పలు పౌర సంఘాలు మంగళవారం కర్ఫ్యూని ఉల్లంఘించి ర్యాలీని నిర్వహించాయి.
శాంతిభద్రతలు దిగజారిన మణిపూర్‌లో ప్రజలు
Related Posts
యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని కేంద్రం
SAKSHITHA NEWS యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఉద్యోగ నియామక దరఖాస్తు ఫారాలపైనా జీఎస్టీ వసూలు చేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. అగ్నివీర్‌తో సహా మిగిలిన ఉద్యోగ నియామకాల దరఖాస్తు ఫారాలపై 18 శాతం…
రాజస్థాన్ లో వైభవంగా పివి సింధు వివాహం
SAKSHITHA NEWS రాజస్థాన్ లో వైభవంగా పివి సింధు వివాహం! హైదరాబాద్:బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిం ది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఘనంగా జరిగింది. ఇరు…