పెద్ద దోర్నాల మండలం, గణేష్ నగర్ నందునూతనంగా నిర్మించిన విగ్నేశ్వరుని ఆలయం

Spread the love

ప్రకాశం జిల్లా, పెద్ద దోర్నాల మండలం, గణేష్ నగర్ నందునూతనంగా నిర్మించిన విగ్నేశ్వరుని ఆలయం నందు శ్రీ విజయ గణపతి దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రంగ రంగ వైభవంగా శ్రీ విజయ గణపతి ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్ట మహోత్సవము అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించారు, ప్రతిష్టాపన ఆచార్య బ్రహ్మశ్రీ మేడవరం అనిల్ కుమార్ శాస్త్రి ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వేద పండితుల వేదమంత్రాలతో ఆలయ యాగ ప్రవేశం, విగ్నేశ్వరుని పూజ, పుణ్య హవాచనం, రుత్వ గారణం, దీక్షాధరణ,గోపూజ, పంగగవ్యప్రాసన, యాగశాల సంస్కారము, అఖండ స్థాపన, వాస్తు మండపారాధన, వాస్తు హోమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు, దోర్నాల మండల పరిసర ప్రాంత భక్తులతో గణేష్ నగర్ కిక్కిరిసిపోయింది, పండుగ వాతావరణం లో ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్ట మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద దోర్నాల ఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో శ్రీ విజయ గణపతి దేవస్థానం ఆలయ కమిటీ, భక్తులు తదితరులు విరివిగా పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page