SAKSHITHA NEWS

పిడిఎస్యూ అర్థ శతాబ్ది ఉత్సవాల సభ కరపత్రం ఆవిష్కరణ

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : విద్యార్థి ఉద్యమ బాహుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీ.డి.ఎస్.యూ అర్థ శతాబ్ది ఉత్సవాల సందర్బంగా ఈ నేల 30 న తిరుమలగిరి మండల కేంద్రంలో జరిగే డివిజన్ సభ కరపత్రాలను అనంతారం మోడల్ స్కూల్ లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పీ.డి.ఎస్.యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్ మాటలాడతూ పీ.డి.ఎస్.యూ విద్యార్థి సంఘం గత 50 సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. కామన్ స్కూల్ విద్యా విధానం కోసం, శాస్త్రీయ విద్యా విధానం కోసం, ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడి పై, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ కామ్రేడ్ జార్జి రెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, కోలా శంకర్, యనాల వీరారెడ్డి, మారోజు వీరన్న, రంగవల్లి లాంటి అనేకమంది విద్యార్థి రత్నాలను పీ.డి.ఎస్.యూ కోల్పోయింది.

ఉస్మానియా యూనివర్సిటీలో పుట్టిన పీ.డి.ఎస్.యూ తెలంగాణ రాష్ట్ర వివిధ రాష్ట్రలతో పాటు దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై పోరాడుతుంది అని అన్నారు.పీ.డి.ఎస్.యూ కి 50 వసంతాలు నిండిన సందర్భంగా తిరుమలగిరి మండల కేంద్రంలో జరిగే డివిజన్ సభను విజయవంతం చేసి అక్టోబర్ 24వ తేదీన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే సభను విజయవంతం చేయడం కోసం వేలాదిమంది విద్యార్థులు తరలి రావలసిందిగా పిలుపునిచ్చారు. ఈ ఆవిష్కరణలో PDSU మండల అధ్యక్షకార్యదర్శి లు శ్రీ చరణ్, సతీష్, ఉపాధ్యక్షులు రాము, సహాయ కార్యదర్శి సంజయ్, కోశాధికారి శ్రీ వచే, మండల కమిటీ సభ్యులు శాషాంక్, రాజ్ కుమార్,వేమా ప్రకాష్, గంగరాజు, మహేష్, లింగన్న, మదన్, సాయి కుమార్ అజయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS