SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 31 at 10.40.40 AM

ఇప్పటికే తన వారాహి యాత్ర ( Varahi Yatra )రెండు విడతల ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల వేడి ని పీక్ స్టేజికి తీసుకెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మూడో విడత వారాహి యాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు..

ఉత్తరాంధ్ర ( Uttarandhra )కేంద్రం గా విశాఖపట్నం పర్యటన చేసే పవన్ కళ్యాణ్ తన తదుపరి విడతలలో విజయనగరం శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన నగరాలను కవర్ చేస్తారని సమాచారం ఉత్తరాంధ్ర నుంచి బారి ఓటింగ్ ను ఆశిస్తున్న జనసేన( Janasena ) ఆ దిశగా ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుందని కీలక నేతలను పార్టీలోకి ఆకర్షించే పనులు మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది. పంచకర్ల రమేష్ బాబును చేర్చుకున్న జనసేన అధ్యక్షుడు మరింతమంది క్రియాశీలక నేతలను పార్టీలోకి ఆకర్షించాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది.

తెలుగుదేశానికి ఇప్పటికే అక్కడ దిగ్గజాలైనటువంటి నేతలు ఉండడంతో పొత్తులో భాగంగా సీట్లను తమకు కేటాయించాలంటే వారిని ఢీకొట్టే లేదా వారి కి సమాన స్థాయి ఉన్న నేతలను జనసేన లో చూపించగలిగితేనే పొత్తులు పలప్రదమయ్యే అవకాశాలుంటాయి. నిజానికి ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే జనసేనతో పోలిస్తే టిడిపి నే బలంగా ఉంది. అయితే పవన్( Pawan ) సామాజిక వర్గం ప్రజలు అధికంగా ఉండడంతోపాటు 2019 ఎన్నికలలో జనసేన కొన్ని నియోజక వర్గాలలో కీలక ప్రభావం చూపించగలగడంతో ఈసారి పొత్తులో భాగంగా ఆ సీట్లను తీసుకుంటే గనక కచ్చితంగా గెలుస్తామన్న అభిప్రాయంలో జనసేన ఉంది..

అంతేకాకుండా అక్కడ జనసేన బలం గెలిపించే స్థాయిలో లేకపోయినా కచ్చితంగా ఓడించే స్థాయిలో మాత్రం ప్రభావం చూపుతున్నందున పొత్తు ధర్మంలో భాగంగా కచ్చితంగా ఈ సీట్లు సాదించాలని భావిస్తున్న జనసేన ఈ దిశగా తెలుగుదేశం పై ఒత్తిడి తీసుకురావడానికి అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది .ఈసారి విజయం సాధించాలంటే జనసేనతో పొత్తు అత్యవసరం ఉన్న భావిస్తున్న తెలుగుదేశం అధినేత కూడా జనసేన అధినేత డిమాండ్లకు తలోగ్గే అవకాశం ఉందని భావిస్తున్న తెలుగుదేశం నేతలు ఇప్పుడు పవన్ వారహయాత్ర సందర్భంగా తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందో అంటూ బయపడుతున్నారట


SAKSHITHA NEWS