మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు

Spread the love

Patel Pond in Miyapur Division

సాక్షిత : మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు వద్ద 7.0 MLD సామర్థ్యం తో – 26.27 కోట్ల రూపాయల అంచనావ్యయంతో జరుగుతున్న STP నిర్మాణ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ,జలమండలి అధికారులతో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పటేల్ చెరువు వద్ద 7.0 MLD సామర్థ్యం తో – 26.27 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయబోయే STP నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలని ,పనులలో వేగం పెంచాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.


హైద‌రాబాద్ నగరం ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది అని, హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కలిపిస్తుంది అని , ప్రజా అవసరాలకునుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తుంది అని , తాగు నీటి సరఫరా ,మురుగు నీటి శుద్ధిలో హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది అని , మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగు నీరు అందిస్తున్నాం అని, ,ప్ర‌స్తుతం జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్న 772 ఎంఎల్‌డీ సీవ‌రేజ్ ప్లాంట్ల‌కు అద‌నంగా 1260 ఎంఎల్‌డీ సీవ‌రేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమ‌తి ఇవ్వడం జరిగిందని,దీనికోసం రూ.

3,866.21 కోట్లు కేబినెట్ కేటాయించిందని,31 ప్రాంతాల్లో ఈ సీవ‌రేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూనందుకు,హైద‌రాబాద్ ప్ర‌జ‌ల త‌ర‌పున,శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కి ,మంత్రి కేటీఆర్ కు హృద‌య‌పూర్వ‌క‌మైన ప్రత్యేక ధ‌న్య‌వాదాలు తెలియచేస్తున్నం అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు . అదేవిధంగా STP ల నిర్మాణం పనులు త్వరితగతిన చేపట్టాలని , నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా STP ల నిర్మాణం పై పలు సూచనలు ,సలహాలు ఇవ్వడం జరిగినది. ఏ చిన్న సమస్య తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా

31 మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల లో భాగంగా మన
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో 7 STP లకు నిధులు మంజూరి చేసిన శుభసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ,మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . చెరువులు కలుషితం కాకుండా మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి చెరువులను సస్యశ్యామలం

,సుందరికరణ చేసి ,ప్రజలకు చక్కటి ఆహ్లదకరమైన వాతావరణం కల్పిస్తామని మరియు STP ల నిర్మాణం కొరకు స్థలాల పరిశీలిన మరియు అనుసరించాల్సిన విధానాల క్షేత్ర స్థాయిలోకి వెళ్లి స్థలాలను పరిశీలించిన సంగతి విదితమే , STP ల నిర్మాణం త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ,అన్ని హంగుల తో ,సకల సౌకర్యాల తో STP ల నిర్మాణము చేపడుతామని,నాణ్యత ప్రమాణాల తో STP ల నిర్మాణం చేపడుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంజూరి అయిన 7 (STP) మురుగు నీటి శుద్ధి కేంద్రాల వివరాలు

  1. మియాపూర్ పటేల్ చెరువు 7.0 MLD capacity – 26.27 కోట్ల అంచనావ్యయం.
  2. గంగారాం పెద్ద చెరువు – 20.0 MLD capacity – 64.14 కోట్ల అంచనావ్యయం.
  3. దుర్గం చెరువు 7.0 MLD capacity – 25.67 కోట్ల అంచనావ్యయం.

4.కాజాగుడా చెరువు.- 21.0 MLD capacity – 61.25 కోట్ల అంచనావ్యయం.

5.అంబిర్ చెరువు 37.0 MLD capacity – 100.87 కోట్ల అంచనావ్యయం.

6.ఎల్లమ్మ కుంట చెరువు
జయనగర్ –
13.50 MLD capacity – 43.46 కోట్ల అంచనావ్యయం.

  1. పరికి చెరువు – 28.0 MLD capacity – 83.05 కోట్ల అంచనావ్యయం.

పైన పేర్కొన్న STP ల నిర్మాణంలకు నిధులు మంజూరి అయినవి అని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జలమండలి
జలమండలి STP విభాగం అధికారులు DGM శ్రీనివాస రాజు, మేనేజర్ శంకర్ ,మెగా ప్రాజెక్ట్స్ ఇంజనీర్ వెంకట్ రామిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు MD. ఇబ్రహీం, మహ్మద్ కాజా తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page