సాక్షిత సికింద్రాబాద్ : భారీ వర్షం కారణంగా చిలకలగుడా సమీపంలో నాలా పై స్లాబ్ భాగం పాక్షికంగా ధ్వంసం కావడంతో అధికార యంత్రాంగం, బీ ఆర్ ఎస్ స్థానిక నాయకత్వం వెంటనే స్పందించింది. అజ్మీర్ పర్యటనలు ఉన్న డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు బీ ఆర్ ఎస్ యువ నేత తీగుళ్ళ కిశోర్ కుమార్, మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రాసురి సునీత, సమన్వయకర్త జలంధర్ రెడ్డి ల బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొంది. జీ హెచ్ ఎం సి ఏ ఈ వేణు అధ్వర్యంలో డీ ఆర్ ఎఫ్, జీ హెచ్ ఎం సి బృందాలను వెంటనే రప్పించి నాలా లోని శకలాలను జే సి బీ సాయంతో తొలగించారు. దాంతో నాలా లోని నీటి ప్రవాహం సాఫీగా సాగేందుకు మార్గం సుగమమై స్థానికంగా ముంపు ముప్పు తప్పింది. రాత్రంతా తీగుళ్ళ కిశోర్ కుమార్, రాసురి సునీత ల ఆధ్వర్యంలోని బృందం ఈ ప్రదేశంలో శకలాలు తొలగించి, బ్యారి కేడ్లు ఏర్పాటు చేసే పనులను కొనసాగించారు
భారీ వర్షం కారణంగా చిలకలగుడా సమీపంలో నాలా పై స్లాబ్ భాగం పాక్షికంగా ధ్వంసం
Related Posts
తెలంగాణ సీపీపీ కన్వీనర్‌గా మల్లు రవి
SAKSHITHA NEWS తెలంగాణ సీపీపీ కన్వీనర్‌గా మల్లు రవి న్యూఢిల్లి: తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) కన్వీనర్‌గా సీనియర్ ఎంపీ మల్లు రవిని ఆ పార్టీ అధినాయకత్వం నియమించింది. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా సీపీపీ కన్వీనర్లను నియమించారు. కాంగ్రెస్…
శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్
SAKSHITHA NEWS శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని వీకర్ సెక్షన్ కాలనీ వెంకటేశ్వర్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్లు పథకం కొరకు అప్లై చేసుకున్న వారిని గుర్తించడం కోసం సిఓ పాప గౌడ్ తో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ మాధవరం…