పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహ కల్ప కాలనీ లో బీఆర్ ఎస్ పార్టీ మహిళ నాయకురాలు శ్రీమతి రజిని ఆధ్వర్యంలో

Spread the love

అంతర్జాతీయ మహిళ దినోత్సవంను పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహ కల్ప కాలనీ లో బీఆర్ ఎస్ పార్టీ మహిళ నాయకురాలు శ్రీమతి రజిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలలో మహిళ సోదరీమణులను శాలవ తో సత్కరించి, జ్ఞాపికలను అందచేసి, మహిళ సోదరిమణులకు అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ .

ఈ సంధర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మహిళ సోదరీమణులందరికి అంతర్జాతీయ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని మహిళ లు వంటింటికె పరిమితం కాకుండా అంది వచ్చిన అవకాశాలను పునికిపుచ్చుకొని అన్ని రంగాలలో ప్రావీణ్యం సాధించి ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని,ఆర్థిక స్వాలంబన పొందాలని,పురుషులతో సమానంగా పోటీ పడలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

‘స్త్రీ’ లేకపోతే జననం లేదు!
‘స్త్రీ’ లేకపోతే గమనం లేదు!
‘ స్త్రీ’ లేకపోతే సృష్టిలో జీవం లేదు!
‘స్త్రీ ‘లేకపోతే అసలు సృష్టి లేదు!


సమాజాన్ని కంటిపాపలా కాపాడే ‘స్త్రీ’ మూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని అదేవిధంగా ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లి అయ్యి మళ్ళీ శిశువుకు జన్మనిచ్చే వరకు ప్రతి దశలో అమ్మ వలె, అన్న వలె, మేనమామ వలె అండగా నిలుస్తున్న మన ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ తెలంగాణ మహిళా బంధుగా నిలిచారు అని, మహిళలు అన్ని రంగాలలో నిలవాలని, మహిళ సాధికారికత సాదించాలని, మహిళ సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టి వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు అని, తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ, కార్యక్రమాల నేపథ్యంలో మహిళ దినోత్సవ సంబరాలను అంబరాలు తాకేలా ఘనంగా చేయడం జరిగినది.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ నిర్వాహకురాలు రజిని ని ప్రత్యేకంగా అభినదించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్ జనరల్ సెక్రెటరీ చింతకింది రవీందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పద్మారావు, రజిని, కుమారి, దివ్య, భూదేవి,లలిత, గౌస్య, నజియా, లత,మంజుల, మనీషా, సోనీ, మధురిమ మరియు మహిళ సోదరిమణులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page