పాపన్న గౌడ్ పోరాట చరిత్ర మరువలేనిది
జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయం
ప్రపంచం గర్వించేలా వేడుకలు చేయాలి
జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతoగి వీరస్వామి గౌడ్
సూర్యాపేట,
బహుజన రాజ్య స్థాపనకు మొఘల్ సామ్రాజ్యం పై పోరాటం చేసి గెలిచి బహుజన రాజ్య స్థాపకులు బహుజన యుద్ద వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట చరిత్ర మరువలేనిదని జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18న ఆయన 372 జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించడం గొప్ప విషయం అన్నారు.ప్రపంచం గర్వించేలా మహనీయుడి జయంతి వేడుకలు ప్రభుత్వం చేయాలని విజ్ఞప్తి చేశారు. 400 ఏళ్ల క్రితమే బహుజన రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో 12 మందితో మొదలైన సైన్యం 12 వేల మంది సైన్యాన్ని తయారుచేసి 21కోట లను ఏలిన బహుజన చక్రవర్తి పాపన్న గౌడ్ అని గుర్తు చేశారు. ప్రభుత్వం 33 జిల్లాలలో ఆయన జయంతి కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించడంతోపాటు జనగామ జిల్లాకు ఆయన పేరును నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు.లండన్ లోని ఓ మ్యూజియం లో ఆయన జీవిత చరిత్ర కు సంబందించిన విగ్రహాలు, ప్రతిమలు ఉన్నాయని పేర్కొన్నారు.