ప్రస్తుతం జరుగతున్న చెన్నూర్ నియోజకవర్గంలో జరుగుతున్న నాటకీయ రాజకీయ పరిణామాలు చూస్తే చాలా బాధేస్తుంది మరియు ఆవేదన కూడా వస్తుంది
ప్రస్తుతం పార్టీలు మారుతున్న నాయకులు ఒకవైపు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరొక పార్టీకి లాలూచి పడుతున్న నాయకులు ఒకవైపు
టికెట్టు రాకముందే బెరసారాలు మాట్లాడుతున్న నాయకులు మరోవైపు వీళ్ళందరికీ చెన్నూరి నియోజకవర్గ ఓటర్లుగా మాకు అక్కడక్కడ కలుగుతున్న సందేహాలని ఈ వేదికగా మీతో పాలు పంచుకోవాలని ఆశతో కొన్ని విషయాలని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం
నిన్న ఒక నాయకుడు చాలా పేద మధ్యతరగతి చెందిన వాడినని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తను ఏమి సంపాదించుకోలేదని మాట్లాడాడు
దానిమీద చెన్నూరు నియోజకవర్గ ఓటర్లుగా ప్రజలుగా మా కొన్ని సందేహాలు మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అనుకుంటున్నాం ఒకవేళ ఉంటే గతంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన మీరు ఎందుకు పార్టీ వారాల్సి వచ్చింది. మీరు ఒక సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని మా కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తే మేము కాంగ్రెస్ కు వచ్చిన మేము మా కుటుంబ సభ్యులమంతా మళ్లీ టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినట్టుగా వెల్లడించారు మరి నేడు కూడా ఆ నాయకుడు బెదిరింపులకు గురి చేస్తే పార్టీ మారే అవకాశం ఉంది ఉన్నట్లే కదా
మీరు గత నాలుగు పర్యాయాలుగా ఉపఎన్నికతో కలిపి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భాలలో మీరు ఏ అభివృద్ధి చేసారో ప్రజల ముందు చెప్పే ప్రయత్నం చేయండి కానీ ఒక నాయకుడి మధ్యలో మరో నాయకుడు మధ్యలో ఉన్న రాజకీయ వైరుధ్యాన్ని ప్రజల ముందు పెట్టి ప్రజల మధ్యలో ఒక అపోహని సృష్టించద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై చెన్నూరు నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి పథంలో ఉంచారో ప్రజల ముందు పెట్టండి మీ అభివృద్ధిని చూసి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారేమో అప్పుడు ఆలోచిద్దాం అంతేకానీ అధికార పార్టీలో ఉన్న నాయకునికి మీకు వ్యక్తిగత విభేదాలకు ప్రజలకు ముడి పెట్టవద్దు
మాకు మరో అనుమానం ఏంటంటే మీరు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి స్థానిక శాసనసభ్యులైనా బాల్క సుమన్ ని మాత్రమే విమర్శిస్తున్నారు కానీ టిఆర్ఎస్ పార్టీని గానీ టిఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని గాని వారి కుటుంబాన్ని మీరు ఎక్కడ కూడా పల్లెత్తు మాట అనకపోవడం మాలో మరింత అనుమానాన్ని రేకెత్తిస్తుంది మీరు చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎడల రాష్ట్రంలో మళ్లీ కేసిఆర్ ప్రభుత్వమే వస్తే మారే అవకాశం నూటికి నూరు శాతం ఉందని ప్రజలుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే కెసిఆర్ ని కేటీర్ ని ఏ రోజు కూడా విమర్శించడం లేదు అంతే కాదు ప్రస్తుత శాసనసభ్యులు బాల్క సుమన్ కి మీకు లోలోపల ఇంకా ఏవో సంబంధాలు ఉన్నట్టుగానే మాకు అనిపిస్తుంది ఎందుకంటే మీరు పార్టీ మారి ఇన్ని రోజులైనా ప్రెస్ మీట్ పెట్టి మీ వ్యక్తిగత విషయాల్ని బయటపెడుతున్నారే తప్ప చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే చేసిన నష్టాన్ని గాని ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టపోయిన ప్రజల్ని కలవడం గానీ అక్కడికి వెళ్లి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం మాత్రం మీరు చేయడం లేదు అంటే దీని అర్థం ఏంటో మీరే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి
ఇకపోతే ప్రతిసారి నేను మాదిగ బిడ్డనని ఈ నియోజకవర్గ ప్రాంతంలో మాదిగలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాట్లాడుతున్నారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మాదిగ సమాజానికి చేసిన లాభమేంటి మీ సతీమణి అయినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి భాగ్యమ్మ చేసిన సహాయం ఏంటో ప్రజల ముందు వచ్చి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం 2018 ఎన్నికల్లో మీ కార్యకర్తగా ఉంటూ బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి నిరసిస్తూ పెట్రోల్ పోసుకొని ఖాళీ తగలబడి చనిపోతే వారి కుటుంబానికి లేక మాదిగ సమాజానికి మీరు ఒరగబెట్టిందేంటో చెప్పాలి అంతేకాదు నాడు 2018లో మీకు టికెట్ నిరాకరించిన సందర్భంగా ఇదే మాదిగల పక్షాన నిలబడి నాకు కేసీఆర్ కావాలనే టికెట్ నిరాకరించారని మీరు ప్రజల ముందుకు వెళ్లి ఇండిపెండెంట్గానో మరి లేదా ఇతర పార్టీ నుండో ఎందుకు పోటీ చేయలేకపోయారు
చెన్నూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమని అందరికీ తెలుసు ఎస్సీలకు అంటే దళితులకు మీరు ప్రత్యేకంగా అధికారంలో ఉన్న సమయంలో వారికి చేసిన లాభాలేంటి వారిని అభివృద్ధి ఎందనికి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏమిటో నిర్మోహ మాటంగా తెలియజేయాలి నాటి నుండి నేటి వరకు కుల పరిస్థితి అలాగే ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక దళితుల పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడిన మాదిరిగానే ఉంది మరి దళిత సమస్యల పైన మీరు రోడ్డుమీదికి వచ్చి ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు ఇంకా ఇంట్లోనే ఉంటూ ఇంకా మా దళిత జాతిని ఏదో మత్తులో తోగిస్తూ గెలుస్తామనే భ్రమలో మీరు ఎందుకు ఉంటున్నారో ప్రజలకు తెలియజేయాలి
చెన్నూరు ప్రజానీకానికి అనేక సమస్యలున్నాయి ప్రతి గ్రామానికి పోతే ఇంటికో సమస్య ఉంది ప్రతి మండలానికి పోతే ప్రతి గడపకు సమస్య ఉంది మీరు ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజల్ని భ్రమల్లో పెట్టి గెలుస్తామని అనుకోవడం పొరపాటే ఇప్పటికైనా ప్రజలకున్న అపోహలని గుర్తించి వాటిని పరిష్కరించి ప్రజల వద్దకు వెళ్లాలి