
సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామం నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాలు వచ్చాయా? లేదా? అని అగిడి తెలుకొని వారికి సంక్షేమ పథకాల ద్వారా వారు పొందిన లబ్ధి ని ప్రజలకు వివరిస్తూ, అలాగే గ్రామంలోని ప్రజలకు ఏమైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలనా మరియు వినుకొండ నియోజకవర్గ లో మీ అభివృద్ధి పరిపాలనలో ఎలాంటి లోటు లేకుండా ఉన్నామని గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
