Our government's program for Gadapa Gadapa in Pittambanda village
సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం పిట్టంబండ సచివాలయం పరిధిలోని 2వ రోజు లో భాగంగా పిట్టంబండ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు .
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాలు వచ్చాయా? లేదా? అని అగిడి తెలుకొని వారికి సంక్షేమ పథకాల ద్వారా వారు పొందిన లబ్ధి ని ప్రజలకు వివరిస్తూ, అలాగే గ్రామంలోని ప్రజలకు ఏమైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలనా మరియు వినుకొండ నియోజకవర్గ లో మీ అభివృద్ధి పరిపాలనలో ఎలాంటి లోటు లేకుండా ఉన్నామని గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు. ప్రతి పక్ష పార్టీల వారి లాగా జన్మభూమి కమిటీ లాగా మెఖాలు చూసి ఫించన్ ఇచ్చే పద్ధతులు ఇప్పుడు లేవని, జన్మభూమి కమిటీల పేరుతో అన్యాయం గా ప్రజల సోమ్మును దోచుకున్నారని ఆరోపించారు.
అలాగే ప్రజా ప్రతినిధులు ఎన్నికల ముందు ఓట్ల కోసం ఇళ్ల ముందుకు వచ్చేవారు,కాని ఇప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవటం కోసం ప్రజాప్రతినిధులు ప్రతి గడపకు వెలుతున్నామని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అని తెలుకోడమేమని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు అభివృద్ధి చెందుతుంటే, ఈ ప్రతిపక్ష నేతలు చూసి ఓర్వలేక ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
మీ ప్రభుత్వం లో మీరు అందించిన సంక్షేమ పథకాలు ఏంటో చెప్పమని అడిగితే ఆ ప్రశ్న కు సమాధానం లేదని అన్నారు. ఈ సచివాలయం పరిధిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సంక్షేమ పథకాల ద్వారా 3 కోట్ల 08 లక్షల 5వేల రూపాయల నిధులను లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల MPP రామిరెడ్డి ZPTC రాజా మండల వైస్సార్సీపీ మండల అధ్యక్షులు చెన్నయ్య మరియు సీనియర్ నాయకులు రామతులసి రెడ్డి ఉమ్మడివరం EX సర్పంచ్ వెంకట్రావు మరియు మండల, గ్రామ వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.