SAKSHITHA NEWS

సాక్షిత : * రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వినుకొండ పట్టణంలోని 1వ వార్డు సచివాలయం పరిధిలో 3వ రోజు నిర్వహించగా, ప్రజల నుంచి విశేష స్పందన లభించింది

.జగన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ నవరత్న పథకాల ద్వారా ఒక్కొక్క కుటుంబానికి సగటున 1లక్ష నుండి 3 లక్షల రూపాయల వరకు ఆర్ధిక సహాయం అందుతుందని, అదేవిధంగా ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ, నవరత్న పథకాలు ప్రతి గడపకు అందుతున్నాయా, లేదా అని, అలాగే గ్రామంలోని పలు సమస్యలను తెలుసుకోవటం కోసం స్వయంగా శాసనసభ్యుల వారే మండల స్థాయి మరియు గ్రామ సచివాలయ అధికారులతో కలిసి గడప గడపకు తిరిగి వారి యెక్క సమస్యలను తెలుసుకొని తక్షణ పరిష్కారం అందించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందని, ఎటువంటి సమస్యలు ఉన్నా, నాకు తెలియపరిస్తే తక్షణ పరిష్కారం చూపుతామని గ్రామ ప్రజలకు తెలియజేశారు.

గ్రామ ప్రజలు వారి గ్రామంలో ఉన్న కొన్ని సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారని వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవలసినదిగా అధికారులను ఆదేశించింనట్లు తెలిపారు. అదేవిదంగా గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఈ వెల్లటూరు గ్రామంలో గడప గడపకు తిరిగి ప్రతీ ఒక్కరికి అందిన సంక్షేమ పధకాలకి సంబంధించిన ఒక్క సమస్య కూడా నా దృష్టికి రాలేదు అంటే మా ప్రభుత్వం ఏవిధంగా ఏటువంటి పక్షపాతం లేకుండా ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందో ప్రతిపక్షాల వారు తెలుసుకోవాలని అన్నారు.

అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని, నందమూరి తారకరామారావు పేరుని అడ్డు పెట్టుకొని రాజకీయంగా లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారని రామారావు పై నిజమైన ప్రేమ మాకు ఉంది కాబట్టే ముఖ్యమంత్రి ఒక జిల్లాకి రామారావు పేరు పెట్టి ఆయన కీర్తిని పెంచారని, కానీ చంద్రబాబు రామారావు నుండి ముఖ్యమంత్రి పదవిని దొంగదారిలో లాక్కొని ఆయనపై చెప్పులు వేపించి అనేక విధాలా అవమానించారనే విషయాన్ని ప్రజలందరూ మర్చిపోలేదని అన్నారు.

అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఏన్నడు లేని విధంగా వినుకొండ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంటే ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకోవాలనే చెడు ఆలోచనతో కోర్ట్ లకి వెళ్లి పనులను ఆపుతున్నారని, తనని ఓడించారనే కారణంతో మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రజలపై పగ తీర్చుకుంటున్నారని ఇది మంచి పని కాదని మీరు ఏదైనా మన ప్రాంత అభిహృద్ధికి సహకరించాలి, ఇంకా ఏదైనా సలహాలు ఇవ్వాలి కానీ అన్ని విధాలా అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారు మన ప్రాంతంలో ఉండటం మన దురదుష్టం అని అన్నారు. ఇలాంటి అభివృద్ధి నిరోధకుడిని ఇక్కడే చూస్తున్నాం, ఎవరు ఎన్ని విధాలా ప్రయత్నించినా వినుకొండ అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరి తరం కాదని అన్నారు.


SAKSHITHA NEWS