SAKSHITHA NEWS

శుక్రవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “జగనన్నే మా భవిష్యత్తు”అంటూ యావత్ ప్రజలు కోరుకుంటున్న కార్యక్రమాన్ని దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడులో దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ప్రారంభించారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ, “జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని అన్నారు. ఈరోజు నుండి 175 నియోజకవర్గాల్లో 7 లక్షల మందితో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం రాష్ట్రంలోని 1.60 కోట్ల కుటుంబాల్లోని కోట్ల మంది ప్రజలతో ఈనెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం ద్వారా మమేకం అవుతారని తెలియజేశారు.
గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 46 నెలల్లో 98.5 శాతం ఎన్నికల హామీలను అమలు చేసి మేనిఫెస్టోకు అసలు సిసలైన మాటతప్పను మడమతిప్పను అనే మాటకు నిజమైన నిర్వచనం ఇచ్చారని, అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కూడా గడవక ముందే సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2 లక్షల కోట్లు జమ చేసి ప్రజల పట్ల తనకున్న నిబద్ధతను చాటారని ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి పేర్కొన్నారు.
విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారన్న విషయాన్ని ప్రజలకి వారి ఇళ్ళ వద్దనే మరోసారి గుర్తుచేసి, జగనన్న పాలనపై వారి అభిప్రాయాన్ని సేకరించనుందని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు చెబుతూ, దెందులూరు నియోజకవర్గంలో తమ పార్టీ పాలనకు తిరుగులేదని ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ప్రకటించారు.దెందులూరు నియోజక వర్గం లో రాజకీయాలకతీతంగా .కులమత
వర్గ పక్ష పాతాలకు తావు లేకుండా ఎవ్వరి పట్ల దౌర్జన్యాలకు పాల్పడకుండా.దుర్భా ష లాడకుండా ఎవ్వరి వ్యక్తిత్వాలకు
ఆత్మాభిమానాలకు భంగం కలగకుండా ఎక్కడా సంస్కారం తప్పకుండా మహిళలను గౌరవిస్తూ
దెందులూరు నియోజక వర్గం లో శాంతి భద్రతలను కాపాడుకుంటూ
రాజకీయంగా నాలుగేళ్లుగా అన్ని వర్గాలు అభిమానించే ఒక సక్సస్ ఫుల్ శాసన సభ్యుడిగా ప్రశాంతమైన సురక్షిత మైన పాలన ప్రజలకందించానని అబ్బయ్య చౌదరి తెలిపారు

ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, సొసైటీ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు


SAKSHITHA NEWS