SAKSHITHA NEWS

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ రాకేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అల్లా పిచ్చి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై కేంద్ర ప్రభుత్వం తప్పుడు పరువు నష్టం కేస్ బనాయించి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించడంపై నగరి బస్టాండు టవర్ క్లాక్ వద్ద ముక్త కంఠంతో ఖండిస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా AICC మెంబర్ భానుమూర్తి మాట్లాడుతూ BJP అక్రమ రాజకీయాలకు చరమ గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి అన్నారు. ఈరోజు చిన్నచిన్న కేసులు పెట్టి మా నాయకుడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా నాయకుడికి ఎప్పుడు కూడా ఎవర్ని కించపరిచే అవసరం లేదు న్యాయబద్ధంగా మా కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కలసి ముందుకు వెళ్తాం  రెండు సంవత్సరాల జైలు శిక్షను కోర్టు విధించడం మనం చూస్తుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ   హోం శాఖ మంత్రివర్యులు వ్యవహరించడం సరికాదన్నారు.  వారి సొంత రాజ్యాంగాన్ని ఈ దేశంలో తీసుకొని వస్తున్నారు ఎందుకంటే ఈ రోజు అబద్దాలను నిజాలుగా చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్రచారం అంత కూడా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు చేపట్టిన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశ ప్రజలకు అసలు నిజాలు తెలిసిపోయేసరికి బిజెపి ప్రభుత్వం వచ్చే ఎలక్షన్ల వరకు రాహుల్ గాంధీ గారిని ఈ దేశంలో ఎక్కడ తిరగకుండా చేయడానికి పన్నాగాలు పండితుండడం ఈ దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు బిజెపి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికలలో ఈ దేశం నుంచి తరిమి వేయడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో PCC మెంబర్ సుధాకర్ రాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబు, చిరంజీవి రెడ్డి, DCC వైస్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి,DCC సెక్రటరీలు ఢిల్లీ,దేశయ్య,మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ దేశప్ప, కార్తీక్, గుణ, ఉదయ్, విజయ్, సతీష్, అల్లావుద్దీన్, గోపాల్, వెంకటేష్, కుమార్, చందు, ప్రకాష్, వసంత్, తంగవేలు ,కిష్టప్ప, కన్యప్ప,మహేష్, పజిల్ భాష, దేశన్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS