మోదీ ప్రవేశపెట్టిన పథకాలే గెలిపిస్తాయి: శంకర్పల్లి మండల బిజెపి ఉపాధ్యక్షులు బండమీది వెంకటేశ్
శంకర్పల్లి: ఏప్రిల్ 29:ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలే బిజెపిని అధికారంలోకి తీసుకొస్తాయని శంకర్పల్లి మండల పార్టీ ఉపాధ్యక్షుడు బండమీది వెంకటేశ్ అన్నారు. సోమవారం మండల పరిధి మోకిల గ్రామంలో వెంకటేశ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ గతంలో 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో ప్రజలకు తెలుసని అన్నారు. 60 సంవత్సరాలు చేయని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత పది సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించారని అన్నారు. ప్రజలందరూ దేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబెట్టబోతున్న బిజెపి పార్టీ వైపే ఉన్నారని ఆయన తెలిపారు. రాబోయే చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.